Russia Earthquake| రష్యాలో భారీ భూకంపం..తీర ప్రాంతాలు అప్రమత్తం
రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. తాజా భూకంపంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఉపసంహరించుకున్నారు. అయితే తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విధాత : రష్యాలో భారీ భూకంపం(Russia Earthquake) సంభవించింది. కామ్చాట్కా(Kamchatka) ప్రాంతానికి తూర్పు తీరంలో సంభవించిన సంభవించిన ఈ భూకంపం ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) భూకంప తీవ్రత వివరాలను వెల్లడించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ధృవీకరించారు. భూమిలో 39కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు.
ఇటీవలే ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. అయితే భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకటన విడుదల చేసింది. జపాన్‌లో కూడా ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ కాలేదు. అయితే ఆయా దేశాల్లో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం హెచ్చరికలు జారీ చేశారు.