Earthquake | భూకంపం అంటే ఏంటి? భూకంపాన్ని జంతువులు ముందే గుర్తిస్తాయా?

భూకంపం ఎందుకు వస్తుంది? భూమిలో ఏం జరుగుతుంది? జంతువులు భూకంపాన్ని ముందే గుర్తిస్తాయా? భూకంప రహస్యాలు తెలుసుకోండి.

Earthquake | భూకంపం అంటే ఏంటి? భూకంపాన్ని జంతువులు ముందే గుర్తిస్తాయా?

భూకంపాలు ఎందుకు వస్తాయి? అసలు భూకంపం అంటే ఏంటి? భూమి లోపల ఏం జరుగుతుంది? భూకంపాలను ముందుగానే పసిగట్టే అవకాశం ఉందా? జంతువులు భూకంపాలను ముందే పసిగడుతాయా? ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తాయి? కారణం ఏంటో తెలుసుకుందాం.

భూకంపం అంటే ఏంటి?

భూమి లోపల టెక్టోనిక్ పలకలు కదులుతాయి. ఈ పలకలు కదిలే సమయంలో లూదా ఢీకొన్నప్పుడు వాటి మధ్య ఒత్తిడి పెరిగి శిలలు ఆకస్మాత్తుగా విరిగిపోతాయి. దీంతో శక్తి విడుదలై భూమి కంపిస్తుంది. ఇలా భూమి కంపించడాన్నే భూకంపం అంటారు. ఇంకా చెప్పాలంటే భూమి నాలుగు పొరలుగా ఉంటుంది. ఈ పొరలను ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్,క్రస్ట్ గా ఉంటాయి. క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు. ఇది 50 కి.మీ. మందం ఉంటుంది. దీని కింద పొరను మాంటక్ అంటాక్ అంటారు. దీని మందం మూడువేల కి.మీ. ఉంటుంది. ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు చాలా చిన్నవి.
భూమిలోపల పొరల మధ్య కదలికతో అధిక ఒత్తిడితో లావా బయటకు వస్తుంది. దీని ప్రభావంతో భూమిపై 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతాయి. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫకాలల్లోని కొన్ని భాగాల్లో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. దీంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దీంతో ఆ శిలాఫలాకాల్లో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పగుళ్ల స్థాయి ఆధారంగా భూకంపం సంభవిస్తుంది.

భూకంపాలకు కారణం ఏంటి?

భూకంపాలకు రకరకాల కారణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ తప్పిదాలు కూడా భూకంపాలకు కారణం అవుతున్నాయి. సౌకర్యాల కోసం ప్రకృతిని నాశనం చేయడం పరోక్షంగా భూకంపాలకు కారణం అవుతుంది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం కూడా భూకంపాలకు కారణం అవుతోంది. ప్రాజెక్టుల్లో ఉన్న వందల టీఎంసీల నీరు భూమిపై ఒత్తిడి పెంచుతుంది. ఇది భూగర్భంలో మార్పులకు కారణం అవుతుంది. దీంతో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని అడవులు ఫాల్ట్ లైన్ ప్రాంతంలో ఉంటాయి. ఈ అడవుల్లో చెట్లు నరికివేయడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు భూమి తన చుట్టూ తాను తిరిగే సమయంలో భూమిలోని పొరల్లో అంతర్గత సర్దుబాట్ల వల్ల కూడా భూకంపాలు సంభివించవచ్చు. హిమపాతాలు, అణు ప్రయోగాలు, సొరంగాలు, గనుల పైకప్పులు కూలిపోవడం వంటివి కూడా భూకంపాలకు కారణం. అగ్ని పర్వతాల విస్పోటనం, భూమిలోపల యురేనియం, థోరియం, అణు విస్పోటక పదార్ధాలు విఘటనం చెందడం కూడా భూకంపాలకు దారితీయవచ్చు.

భూకంప తరంగాలు ఎన్ని రకాలు?

భూకంప తరంగాలను మూడు రకాలుగా విభజించారు. ప్రాథమిక తరంగాలు లేదా పీ తరంగాలు లేదా తోసే తరంగాలు అని అంటారు. ఇక కదిలించే తరంగాలు ద్వితీయ రంగాలు అని పిలుస్తారు. ఇక మూడోవి ఎల్ తరంగాలు. వీటిని ర్యాలీ తరంగాలు లేదా ఉపరితల తరంగాలు అంటారు. ప్రాథమిక తరంగాలు సెకనుకు 5 కి.మీ. నుంచి 13.8 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి శబ్ద తరంగాలను పోలి ఉంటాయి. వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తారు. ఇవి ఘన, ద్రవ పదార్ధాలు రెండింటిలో ప్రయాణిస్తాయి. ద్వితీయ తరంగాలు సెకనుకు 3.2 నుంచి 7.2 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఇక తిర్యక్ తరంగాలు సెకనుకు 4 కి.మీ నుంచి 4.3 కి.మీ వేగంతో వెళ్తాయి.

రోజుకు ఎన్ని భూకంపాలు వస్తున్నాయి?

అమెరికాలోని జాతీయ భూకంప సమాచార కేంద్రం ప్రకారం ప్రపంచంలో ప్రతి ఏటా సుమారు 20 వేల భూకంపాలు సంభవిస్తున్నాయి. అంటే సగటున రోజుకు 55 భూకంపాలు ఎక్కడో ఒక్కచోట వస్తున్నాయి. 1900 సంవత్సరం నుంచి ఒక్క ఏడాదిలో ప్రపంచంలో 16 పెద్ద భూకంపాలు వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రిక్టర్ స్కేల్ పై ఏడు తీవ్రతను సూచించే భూకంపాలు 15 నమోదౌతున్నాయి. 8.0 తీవ్రతతో ఒక్క భూకంపం ఉంటుంది. 2010లో పలు దేశాల్లో అత్యధిక భూకంపాలు సంభవించాయి. ఇందులో 23 భూకంపాలు 7.0 తీవ్రతను నమోదు చేశాయి. మిగిలిన సంవత్సరాల్లో సగటున 16 భూకంపాలు నమోదయ్యాయి. 1989లో భారీ భూకంపాలు ఆరు మాత్రమే వచ్చాయి. 1988లో అవి ఏడుగా ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి.

భూకంపాలను జంతువులు గుర్తిస్తాయా?భూకంపాలను జంతువులు ముందే గుర్తిస్తాయి. క్రీస్తు పూర్వం 373లో భూకంపాలను జంతువులు ముందే గుర్తిస్తాయనే ప్రస్తావన వచ్చింది. గ్రీస్ లో ఈ విషయం తొలుత గుర్తించారు. ఎలుకలు, పాములు, పిల్లులు , పశువులు భూకంపాలను ముందుగానే గుర్తిస్తాయని చెబుతారు. భూకంపాలు ఏర్పడడానికి భూమిలోపల జరిగే అసాధారణ పరిస్థితులను జంతువులు ముందుగానే గుర్తించి తాము ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తాయని నమ్మకం. జంతువుల అసాధారణ కార్యకలాలపాలను దృష్టిలో ఉంచుకొని చైనాలో భూకంపం వచ్చే అవకాశం ఉందని దశాబ్దాల క్రితమే సూచించినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ సూచన వచ్చిన సమయంలో ప్రజలు ఇళ్లలో కాకుండా ఆరుబయట నిద్రించేవారని చెబుతారు.

ఎంత తీవ్రతతో భూకంపం వస్తే నష్టం

భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ పై గుర్తిస్తారు. భూకంప తీవ్రత 7 నుంచి 7.9గా ఉంటే ఆస్తి, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. ఎనిమిది కంటే భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైతే తీవ్ర విధ్వంసానికి దారి తీసే అవకాశం ఉంటుంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6 నమోదైతే భవనాలు దెబ్బతింటాయియ. 6.1 నుంచి 6.9 రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైతే దీని తీవ్రత 100 కి.మీ. వైశాల్యం వరకు ఉంటుంది. ఇండియాలో ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో భూకంపాలు వస్తాయి. దీని ప్రభావం గుజరాత్, అసోం, మహారాష్ట్ర, జమ్మూ, బీహార్ రాష్ట్రాలపై పడుతోంది.