Future Earthquake Risks | చీలిపోతున్న భారత టెక్టోనిక్ ప్లేట్! భవిష్యత్తులో భారీ భూకంపాలు?
భారత్ టెక్టోనిక్‌ప్లేట్, యూరేషియా ప్లేట్ మధ్య ఘర్షణలో భారత ప్లేట్.. టిబెట్ కింద భూమి లోపలికి జారుతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీని కారణంగా భవిష్యత్తులో హిమాలయ ప్రాంతాల్లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
Future Earthquake Risks | భూమి ఉపరితలం శాంతంగా కనిపించినా, భూగర్భంలో మాత్రం నిత్యం నిరంతర మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. భూమి ఇంకా మార్పులకు లోనవుతూనే ఉన్నది. భూగర్భంలో కదలికలు.. దాని స్వరూపాన్ని మార్చుతూనే ఉన్నాయి. భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్లు ఉంటాయని, అవి భూ ఊపరితలం కింద ఢీకొంటే భూకంపాలు సంభవించడం, అదే సముద్రంలో అయితే సునామీలు రావడం తెలిసిందే. భూమి ఏర్పడిన కొత్తలో ఈ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్లే ఇప్పుడు మనం చూస్తున్న పర్వతశ్రేణులు ఏర్పడ్డాయి. అయితే.. అంతకు మించిన ప్రమాదాన్ని భారత ఉప ఖండం ఎదుర్కొనే పరిస్థితులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Zanclean Mega Flood | ఒక మహావరద మధ్యధరా సముద్రాన్ని సృష్టించిందా?
చీలిపోతున్న ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్!
ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్.. టిబెట్ అడుగు భాగాన చీలిపోతున్నదని జియాలజిస్టులు సంచలన విషయం బయటపెట్టారు. భూమి అంతర్భాగం ఎలా మారుతూ వస్తున్నదన్న విషయంలో ఇప్పటికే అవగాహనను తాజా పరిశోధన పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ జియో ఫిజికల్ యూనియన్ (ఏజీయూ) 2023 కాన్ఫరెన్స్‌లో ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. టిబెట్ ప్రాంతంలోని 94 భూకంప నమోదు కేంద్రాల నుంచి తీసుకున్న భూకంప తరంగాల విశ్లేషణ ద్వారా ఈ భూగర్భ మార్పులు వెలుగుచూశాయి. భారత ప్లేట్.. యూరేషియా ప్లేట్ కిందికి జారిపోవడమే కాదు.. లోతున అది రెండు భాగాలుగా విడిపోతున్నదని ఆధునిక సెస్మిక్ (భూకంప) వివరాల ఆధారంగా అంచనాకు వచ్చారు. భూకంపాల డాటాను అనుసరించి.. భారత ప్లేట్.. ‘డిలామినేషన్’అనే ప్రక్రియను ఎదుర్కొంటున్నది. అంటే.. దాని దిగువన ఉన్న దట్టమైన పొర.. కిందికిగి దిగిపోతూ ఉన్నది. అదే సమయంలో పై భాగం టిబెట్ కిందకు చొచ్చుకుపోతున్నది.
Zealandia continent | కనిపించేవి ఏడు ఖండాలైతే.. కనిపించని ఆ ఎనిమిదో ఖండమే.. జీలాండియా!
హిమాలయాల ఆవిర్భావంపై కొత్త కథ!
హిమాలయ పర్వతాలు, టిబెట్ పీఠభూమి ఏర్పడేందుకు ఇండియా ప్లేట్, యూరేషియా ప్లేట్ ఢీకొనడమే కారణమని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. కానీ.. కొత్త వివరాలు పూర్తిగా కొత్త అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ ఢీకొనే ప్రక్రియ అంత తేలికగా సాగలేదని అంటున్నాయి. నిజానికి భారత్ ప్లేట్, యూరేషియా ప్లేట్‌లు ఢీకొనడం సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితమే మొదలైంది. ఈ రెండు ప్లేట్‌ల ఘర్షణ నుంచే భూమిపై అత్యంత ఎత్తైన హిమాలయా పర్వతాలు ఉద్భవించాయి. అయితే.. తాజా అధ్యయనం ప్రకారం.. భారత ప్లేట్ నానాటికి లోతుకు దిగజారుతున్న కారణంగా హిమాలయా పర్వాతాల పెరుగుతున్నాయని చెబుతున్నారు. కింది భాగం భూమి గర్భంలోకి.. అంటే మాంటిల్‌వైపు దిగిపోతుండగా.. పై పొర ఉత్తర దిశగా నెట్టుకుంటూ యూరేషియా ప్లేట్‌ను ఢీకొడుతున్నది. మీకు గుర్తుంటే.. టిబెట్, నేపాల్ తదితర దేశాల్లో భీకరమైన భూకంపాలు వచ్చాయి. టిబెట్ కింద లోతైన చీలికలు ఏర్పడటం ఒత్తిడులను సృష్టిస్తున్న కారణంగానే భూకంపాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు మరిన్ని చోటు చేసుకునేందుకు సూచికలుగా ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలను పరిగణిస్తున్నారు. అవి కూడా అతి భారీ భూకంపాలు అవుతాయని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Universe End | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
Bronze Age Ancient Village Video | చెరువులో నీటి కింద 3 వేల ఏళ్ల క్రితం నాటి కంచు యుగపు గ్రామం! (వీడియో)
Dark Oxygen Future Energy | సముద్రంలో 13,123 అడుగుల లోతున ‘బ్యాటరీ’ రాళ్లు! వాటితో ఆక్సిజన్ ఉత్పత్తి!
Maleriraptor kuttyi | తెలంగాణలో జీవించిన.. డైనోసార్ మలేరిరాప్టర్ కుట్టి గురించి మీకు తెలుసా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram