Universe End  | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?

Universe End  | 2022 యుగాంతం.. యుగాంతం.. ఎవ్వరూ ఉండరు.. అంతా చనిపోతారు.. అంటూ అరుపులు కేకలతో వచ్చిన సినిమా యాడ్‌ గుర్తుందా? దాని సంగతెలా ఉన్నా.. ఆకాశంలో జరిగే అనూహ్య మార్పులే ఈ విశ్వాన్ని నాశనం చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.

Universe End  | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?

Universe End  | మన విశ్వం 1360 కోట్ల సంవత్సరాల నాటిది. శతాబ్దాలుగా అసంఖ్యాక శాస్త్రజ్ఞులు దీనిని నిశితంగా శోధిస్తూనే ఉన్నారు. బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం విశ్వం ఏర్పడిందని అనేక పరిశోధనల అనంతరం తేల్చారు. అనేక పాలపుంతలు, ఎక్సోప్లానెట్స్‌, నక్షత్రాల గురించి ఇప్పటికీ మనం కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. శోధించినదానికన్నా శోధించనిదే ఎక్కువ ఉన్నది. ఇప్పటి వరకూ మనకు తెలిసింది నలుసంతే. ఇంకా గ్రహాంతరవాసులు సహా అనేక విషయాలు అంతుచిక్కకుండానే ఉన్నాయి. అయితే.. ఈ విశ్వం కూడా ఏదో ఒక నాడు అంతం కావాల్సిందే. నక్షత్రాలు, గ్రహాల తరహాలోనే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతరించికపోక తప్పదు. అయితే.. అది ఎప్పుడు?

ప్రస్తుతం మన విశ్వం స్థిరంగా

అంతరిక్షంలోని బ్లాక్‌ హోల్స్‌ మేటర్‌ను స్వాహా చేస్తూ.. నక్షత్రాలు నిరంతరాయంగా చనిపోతూ, కొత్తవి ఉదయిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మన విశ్వం స్థిరంగా ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. అది ఎప్పుడైనా మారిపోవచ్చని అంటున్నారు. క్వాంటం క్షేత్రాలను వారు వేలెత్తి చూపుతున్నారు. అందులో ఒకటి బహుశా అంతిమ దశలో ఉండి.. కొత్త దశలోకి ప్రవేశిస్తున్నది. అది ప్రేరేపించే అస్థిరతతో అంతిమంగా విశ్వం అంతమొందుతుంది. ఫిజిక్స్‌లో ఇన్‌స్టెబిలిటీని ఫాల్స్‌ వాక్యూం డెకాయి అని పిలుస్తారు. ఇది సంభవించినప్పుడు టైఫూన్‌ వంటి పరిస్థితి నెలకొంటుంది. ఇది విశ్వాన్ని తుడిచిపెడుతూ ప్రతిదానినీ అంతం చేస్తుంది. విశ్వం ప్రస్తుత పరిస్థితి ఆధారంగా రూపొందించిని భౌతిక శాస్త్ర నియమాలు కూడా మారిపోతాయి. అప్పటికి మనమే ఉనికిలో ఉండం.. ఇక కొత్త నియమాలను రూపొందించేదెవరు? శాస్త్రవేత్తలు చెబుతున్న క్వాంటం ఫీల్డ్స్‌లో ఎలక్ట్రోమాగ్నిటిక్‌ ఫీల్డ్‌ కూడా ఒకటి. సూర్యకాంతి, మన మొబైల్‌ ఫోన్లలో విద్యుత్తు వంటివాటికి ఇదే ఆధారం. ఇనుప రజను అయస్కాంతాలతో ఎలా ఆకర్షితమవుతుందో గమనించే ఉంటారు. వక్ర అయస్కాంత క్షేత్ర రేఖలు (curved magnetic field lines)తో ఇది సాధ్యమవుతున్నది. ఈ రేఖలు మనకు కనిపించవు. కానీ.. ఈ విశ్వం మొత్తం నిండిపోయి ఉంటాయి.

హిగ్స్‌ ఫీల్డ్‌ అస్థిరంగా ఉన్నదా?

అన్ని కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చేదే హిగ్స్‌ ఫీల్డ్‌. దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉంటాయి. హిగ్స్‌ ఫీల్డ్‌ స్థిరంగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అది పొరపాటు లేదా తాత్కాలిక వాక్యూమ్‌ స్థితిలో ఉండి, అంతకంటే తక్కువ స్థితిలోకి ప్రవేశించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్ని క్వాంటం ఫీల్డ్స్‌ వాటి అత్యల్ప శక్తి స్థితులను చేరుకోవడం మాత్రం ఖాయం. హిగ్స్‌ విషయంలో కూడా ఇదే నిజమని అంటున్నారు. ప్రస్తుతం అది దాని అత్యల్ప స్థాయిలో లేకపోయినా.. అది ఏదో ఒక రోజు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అది హిగ్స్‌ ఫీల్డ్‌ను, భౌతిక, రసాయన శాస్త్రాలను మార్చేస్తుంది. ప్రతిదాన్నీ గందరగోళ స్థితిలోకి నెట్టేస్తుంది. ‘ఇది జరిగినప్పుడు హైడ్రోజన్‌ను మించిన చాలా అణువులు ఉనికిలో ఉండవు. విచ్ఛిన్నమవుతాయి’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సైద్ధాంతిక భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ డేవిడ్ టోంగ్ చెప్పారు. అణు స్పందనలు ఇకపై పనిచేయబోవని, దాని వలన నక్షత్రాలు వెలిగే లక్షణాన్ని కోల్పోతాయని ఆయన పాపులర్‌ మెకానిక్స్‌కు చెప్పారు. కెమిస్ట్రీ అనేది ఇక ఉండదు.. దాంతో జీవనం అసాధ్యం అయిపోతుంది. విశ్వం ఇప్పుడు ఉన్నత అద్భుతంగా, శక్తిమంతమైన ప్రదేశంగా ఉండబోదని ఆయన పేర్కొన్నారు.

అంతం ఎప్పుడంటే..

ఈ పెను విపత్తు వెనుక కాస్మొలాజికల్‌ బబుల్‌ ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వంలోని ఒక ప్రదేశం నుంచి మొత్తం విశ్వానికి వాస్తవ వాక్యూమ్‌ విస్తరించినప్పుడు ఈ బబుల్‌ ఏర్పడుతుందని అంటున్నారు. సంక్లిష్ట పరస్పర చర్యల ద్వారా కాస్మొలాజికల్‌ (బబుల్స్‌) బుడగలు వ్యాపిస్తాయని జర్మనీలోని ఫోర్‌స్చంగ్స్‌జెంట్రమ్ జులిచ్‌లో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకుడు జాకా వోడెబ్ (పీహెచ్‌డీ), అతని టీమ్‌ ఒక అధ్యయాన్ని ప్రచురించారు. విశ్వం ఎలా అంతరించిపోతుందో అందులో ఒక సిద్ధాంతాన్ని పేర్కొన్నారు. అయితే.. విశ్వసం అంతమయ్యేందుకు ప్రస్తుత విశ్వం వయసుకు కోట్ల కోట్ల కోట్ల కోట్ల రెట్ల సమయం పడుతుందని టాంగ్‌ చెబుతున్నారు. సో.. హ్యాపీ!

ఇవికూడా చదవండి..

Massive Copper Deposit | 8.4 లక్షల కోట్ల విలువైన 2 కోట్ల టన్నుల రాగి నిక్షేపాలు.. ఎక్కడంటే..
Another SkyLab | పది పదిహేను రోజుల్లోనే భూమిపై పడనున్న మరో ‘స్కైలాబ్‌’.. పడేది ఎక్కడంటే..
Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?
Telangana | అకాల వర్షాలు.. ఆరుగాలం శ్రమ నీటి పాలు!
Job Opportunities | తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల ధమాకా! ఏపీలో మెగా డీఎస్సీ, తెలంగాణలో ఆర్టీసీ కొలువులు
Zanclean Mega Flood | ధ‌రిత్రిపై ఏకైక అతిపెద్ద మ‌హావ‌ర‌ద‌! ఎప్పుడు.. ఎక్క‌డ‌? ప‌రిశోధ‌కులు ఏమంటున్నారు?