Menaka Guruswamy : రాజ్యసభకు తొలిసారిగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వ్యక్తి!

రాజ్యసభకు టీఎంసీ అభ్యర్థిగా మేనకా గురుస్వామి ఎంపిక. ఎన్నికైతే పార్లమెంట్‌లో తొలి ఎల్జీబీటీక్యూ సభ్యురాలిగా చరిత్ర సృష్టించే అవకాశం.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 28, 2026, 3:41 pm IST
Read Time: 3 mins
Menaka Guruswamy : రాజ్యసభకు తొలిసారిగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వ్యక్తి!

విధాత : దేశ వ్యాప్తంగా 11రాష్ట్రాలలో ఖాళీయైన 37రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరుగనున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్(tmc)ప్రకటించిన అభ్యర్థుల వ్యవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పశ్చిమబెంగాల్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఒకరు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఉన్నారు. ఆమెనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి. మేనకా గురుస్వామిని రాజ్యసభ సభ్యత్వానికి అభ్యర్థిగా ఎంపిచేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మేనక గురుస్వామితో పాటు రాష్ట్ర మంత్రి బాబుల్‌ సుప్రియో, బెంగాల్‌ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్, నటి కోయల్‌ మల్లిక్‌లను టీఎంసీ తన అభ్యర్థులుగా ప్రకటించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదియైన మేనకా గురుస్వామి రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు. 2018లో స్వలింగ బంధాల గురించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇవ్వడంలో మేనకా గురుస్వామి కీలక పాత్ర పోషించారు. ఈ కేసు వాదించిన గురుస్వామి కూడా ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ వంటి వర్గాలను తెలియజేసే పదం) కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక కానున్న తొలి ఎల్‌జీబీటీక్యూ అభ్యర్థిగా ఆమె మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.

ఇవి కూడా చదవండి :

శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ !
Kuno National Park | కూనో పార్కులోకి మరో తొమ్మిది చీతాలు!