ముగిసిన పార్లమెంటు సమావేశాలు..తొలిసారిగా ‘వందేమాతరం’ గీతాలాపన

జులై 20 నుంచి19 రోజుల పాటు వాయిదాల పర్వంతో సాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్ ఆండ్ మినరల్స్ బిల్లును రాజ్యసభ ఆమోదించిన అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా వేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 13, 2026, 1:32 pm IST
Read Time: 4 mins
ముగిసిన పార్లమెంటు సమావేశాలు..తొలిసారిగా ‘వందేమాతరం’ గీతాలాపన

జులై 20 నుంచి19 రోజుల పాటు వాయిదాల పర్వంతో సాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్ ఆండ్ మినరల్స్ బిల్లును రాజ్యసభ ఆమోదించిన అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.

ఈ బిల్లుతో కలిపి ఈ సమావేశాలలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు(యాంటీ పేపర్ లీక్ బిల్లు), వందేమాతరం బిల్లు, కేరళం బిల్లు సహా మొత్తం 12 బిల్లులను ఆమోదించారు. ఎఫ్ సీఆర్ఐ బిల్లును మాత్రం జేపీసీకి పంపించారు.

నీట్ పేపర్ లీకేజీ, విద్యార్ధుల నిరసలపైన లాఠీచార్జ్, ఆయోధ్య రామమందిరం విరాళాల చోరీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటకు పట్టుబట్టిన విపక్షాలు వరుసగా పార్లమెంటు సమావేశాలకు అడ్డుపడటంతో 19రోజుల పాటు సభా కార్యకలాపాలు తుడిచిపెట్టుకుపోయాయి. విపక్షాల నిరసనల నేపథ్యంలో కీలకమైన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును కేంద్రం మరోసారి ప్రవేశ పెట్టలేకపోయింది.

ఆఖరి రోజు సమావేశాలలో పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ గీతాలాపనతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు.

వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకునే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. వందేమాతరం పాడేటప్పుడు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటారు. లోక్ సభ వాయిదా అనంతరం స్పీకర్ ఓంబిర్లా ఏర్పాటు చేసిన తేనేటి విందుకు విపక్ష సభ్యులు హాజరుకాలేదు. డీఎంకే సభ్యురాలు కనిమెుళి మాత్రం హాజరయ్యారు.