త్వరలోనే కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ సీజన్ 2 ప్రారంభం అవుతుందని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. ఢిల్లీలో రెండో దశ నిరసనలకు తెరలేపుతామని ప్రకటించిన అభిషిత్ దిప్కే.. మునుపటి ఆందోళనను మించిన స్థాయిలో, మరింత విస్తృత సమీకరణతో, ప్రజా సమస్యలపై, ముఖ్యంగా విద్యారంగం సమస్యలపై ఉద్యమిస్తామని వెల్లడించడం గమనార్హం.
ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబర్ 1 నుండి జాతీయ స్థాయిలో ‘క్యా బోల్తీ పబ్లిక్’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘క్యా బోల్తీ పబ్లిక్’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. విద్య, నిరుద్యోగం, వ్యవస్థల జవాబుదారితనంపై దృష్టి సారించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అభిజిత్ దిప్కే తెలిపారు. తాజాగా జంతర్-మంతర్ ఉద్యమం సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుందని దీప్కే ప్రకటించడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
సీజేపీలోని వ్యక్తుల కార్యకలాపాలపై దర్యాప్తు కోరుతూ పిటిషన్
మరోవైపు నకిలీ న్యాయవాదులు, బూటకపు లా డిగ్రీలు, సీజేపీతో అనుసంధానమైన వ్యక్తుల కార్యాకలాపాలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, సీబీఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ)ల స్పందనకు సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయవాది రాజా చౌధరీ ఈ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం ముందు హాజరై వాదనలు వినిపించారు.
జంతర్ మంతర్ సీజన్ – 2 అతి త్వరలోనే రాబోతోంది
– సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే pic.twitter.com/93DSPYbe9I
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 12, 2026