• Telugu News
  • /National

ఆ విద్యార్ధులను విడుదల చేయండి : సుప్రీం కీలక ఆదేశాలు

జంతర్‌మంతర్‌ వద్ద నిరసనల్లో అరెస్టైన నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగంపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని సూచించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 28, 2026, 1:56 pm IST
Read Time: 3 mins
ఆ విద్యార్ధులను విడుదల చేయండి : సుప్రీం కీలక ఆదేశాలు

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నిరసనల్లో పాల్గొని అరెస్టయిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. ఈ వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన నిరసనల్లో భాగంగా పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేయాలని తెలిపింది. దీంతో నీట్‌ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన నిరసనకారులకు ఊరట దక్కినట్లైంది. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించడం, పెల్లెట్‌గన్స్‌ వాడకం పైనా కోర్టు విచారణ కొనసాగించింది. ఈసందర్భంగా ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కమిటీకి సీజేఐ సూచించారు. సిట్‌ ఏర్పాటుచేసి దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు.

విచారణ సందర్బంగా ధర్మాసనం విద్యార్ధులపై పెల్లెగ్ గన్స్, ఎలక్ట్రికల్ లాఠీలను ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుత నిరసనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.