• Telugu News
  • /Telangana

Pawan Kalyan : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. షెడ్యూల్‌ను జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 04, 2026, 1:30 pm IST
Read Time: 3 mins
Pawan Kalyan : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ ఈ నెల 7, 8వ తేదీల్లో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తారు. ఈ మేరకు పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది. బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ తెలిపింది. పవన్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సైతం తెలంగాణ మున్సిపల్ బీజేపీకి మద్దతు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రచారం చేయనున్నట్టుగా తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావులు మంగళవారం రాత్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్ ప్రచారంపై ప్రకటన వెలువడింది.

ఇవి కూడా చదవండి :

Bandla Ganesh | “నా బూడిద కూడా పవన్ కళ్యాణ్‌ను తిట్టదు” … బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా..? ఇంట్లోనే ఈ టెక్నిక్‌ ద్వారా ఈజీగా కనిపెట్టేయొచ్చు!