Alaska | అల‌స్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ

Alaska | అమెరికాలోని అల‌స్కా స‌మీపంలో భారీ భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 7.4గా న‌మోదైన‌ట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది. ఈ భారీ భూకంపం వ‌ల్ల ద‌క్షిణ అల‌స్కాను, అల‌స్కా ద్వీప‌క‌ల్పాన్ని సునామీ చుట్టుముట్టే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అల‌స్కాలోని శాండ్ పాయింట్‌కు 98 కిలోమీట‌ర్ల దూరంలో 32.6 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం నేప‌థ్యంలో ప్రాణ‌, ఆస్తి నష్టానికి సంబంధించిన స‌మాచారం తెలియ‌లేదు. పసిఫిక్‌ […]

Alaska | అల‌స్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ

Alaska | అమెరికాలోని అల‌స్కా స‌మీపంలో భారీ భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 7.4గా న‌మోదైన‌ట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది. ఈ భారీ భూకంపం వ‌ల్ల ద‌క్షిణ అల‌స్కాను, అల‌స్కా ద్వీప‌క‌ల్పాన్ని సునామీ చుట్టుముట్టే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

అల‌స్కాలోని శాండ్ పాయింట్‌కు 98 కిలోమీట‌ర్ల దూరంలో 32.6 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం నేప‌థ్యంలో ప్రాణ‌, ఆస్తి నష్టానికి సంబంధించిన స‌మాచారం తెలియ‌లేదు. పసిఫిక్‌ మహాసముద్ర తీరంలోగల ఉత్తర అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలు, కెనడా తీర ప్రాంతాలపై సునామీ తీవ్రత ఏ మేరకు ఉండనుందో అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అల‌స్కాలో 1964, మార్చి నెల‌లో 9.2 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. ఉత్త‌ర అమెరికా ప్రాంతంలో ఇప్ప‌టి వ‌ర‌కు సంభ‌వించిన భూంక‌పాల్లో అదే అత్యంత తీవ్ర‌మైన‌దిగా చెబుతుంటారు. నాటి సునామీ విల‌యానికి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.