Break Fast for BP Patients | అధిక రక్తపోటు ఉన్న వారికి ఈ అల్పాహారం బెస్ట్..! మీరు ట్రై చేయండి..!!
Break Fast for BP Patients | ఇటీవలి కాలంలో చాలా మంది తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. బిజీ లైఫ్ గడుపుతూ విశ్రాంతి తీసుకోవడం లేదు. ఇలాంటి వారు బీపీ(Blood Pressure ), డయాబెటిస్( Diabetic ) వంటి రోగాల బారిన పడుతున్నారు. ఇక ఈ రోగాల బారిన పడ్డవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే రోగం మరింత ముదిరి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా బీపీ కలిగిన పేషెంట్లు( BP Patients ) ఎలాంటి అల్పాహారం( Break Fast ) తీసుకుంటే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం.
Break Fast for BP Patients | ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి బ్యాలెన్స్ డైట్( Balance Diet ) అనేది చాలా కీలకం. సమతుల్యమైన అల్పాహారం తీసుకుంటే రక్తంలో షుగర్( Sugar ) కంట్రోల్ అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి కూడా ఉండదు. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్( Break Fast ) తీసుకుంటే బీపీ కూడా అదుపులో ఉంటుందని చెప్తున్నారు. మరి అధిక రక్తపోటు( Blood Pressure )ను కంట్రోల్ చేసే టిఫిన్స్ ఇవే. ఈ అల్పాహారాన్ని మన మెనూలో ఉంచుకుంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు.
రాగులు
రాగులు సహజంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంతో సమృద్ధిగా ఉంటాయి. మజ్జిగతో తయారుచేసిన రాగి గంజి లేదా తక్కువ ఉప్పు చట్నీతో రాగి ఇడ్లీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
స్ప్రౌట్స్
స్ప్రౌట్స్‌లో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఉప్పు లేకుండా కీరదోసకాయ, టమోటా, నిమ్మకాయ, బ్లాక్పెప్పర్తో కలిపి తీసుకోవచ్చు. ఇది బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
ఓట్ మీల్
ఓట్ మీల్ కూడా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ను అందిస్తుంది. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉండటానికి సహాయపడతాయి. దీనిని ఫ్రూట్స్‌తో లేదా పాలతో తీసుకోవచ్చు.
ఇడ్లీ
పులియబెట్టిన బియ్యం, మినపప్పుతో తయారు చేసిన ఇడ్లీ తీసుకోవచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. కూరగాయలు అధికంగా ఉండే, తక్కువ ఉప్పు, తక్కువ నూనె కలిగిన సాంబార్‌తో కలిపి తీసుకోవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది బెస్ట్ ఫుడ్ అవుతుంది.
పోహా..
కూరగాయలు అధికంగా ఉండే పోహాలో సోడియం తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యారెట్లు, బఠానీలు, ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. చివర్లో కాస్త నిమ్మకాయ, కొత్తిమీర వేసుకుంటే.. ఉప్పు తక్కువగా ఉన్న తినేందుకు అద్భుతంగా ఉంటుంది.
పెరుగు
లో ఫ్యాట్ పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం ఉంటాయి. ఇవి గుండెకు మంచివిగా భావిస్తారు. దీనిని అరటిపండు లేదా బొప్పాయి, అవిసె గింజలు లేదా చియా సీడ్స్తో కలిపి తీసుకోవచ్చు. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram