Allu Sirish | పెళ్లికి ముందు ముద్దులతో ముంచెత్తాడుగా .. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ వీడియో వైరల్
Allu Sirish |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యువ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. నయనిక అనే యువతితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గతేడాది అక్టోబర్ 31న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
Allu Sirish |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యువ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. నయనిక అనే యువతితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గతేడాది అక్టోబర్ 31న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఉంగరాలు మార్చుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన శిరీష్–నయనికలు, వచ్చే మార్చి 6న వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.
పెళ్లికి ఇంకా నెల రోజుల సమయం ఉండగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోరుగా ప్రారంభమయ్యాయి. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పే క్రమంలో అల్లు శిరీష్ తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు వేదికగా దుబాయ్‌ను ఎంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పార్టీలో అల్లు అర్జున్–స్నేహ దంపతులు, కాబోయే వధువు నయనికతో పాటు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల అల్లు శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన మరో వీడియోను షేర్ చేశారు. అందులో కాబోయే వధూవరులు, అల్లు అర్జున్, స్నేహతో పాటు మిగతా స్నేహితులు డ్యాన్స్‌లు చేస్తూ, ఫోటోలు దిగుతూ ఆనందంగా గడిపిన క్షణాలు కనిపించాయి. ముఖ్యంగా నయనికకు శిరీష్ ముద్దు పెడుతూ ప్రేమను వ్యక్తం చేసిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు “దుబాయ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ – స్వీట్ మెమోరీస్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు, అభిమానులు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు కుటుంబంలో మరో శుభకార్యం జరగబోతుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. మార్చి 6న జరగబోయే ఈ వివాహ వేడుక టాలీవుడ్‌లో మరో గ్రాండ్ ఈవెంట్‌గా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram