OTT Movies | ఓటీటీలో ఒక్కరోజే 19 సినిమాల డిజిటల్ రిలీజ్.. అన్ని జానర్ల వినోదం ప్రేక్షకుల ముందుకు

OTT Movies | ఓటీటీ ప్రియులకు ఇవాళ భారీ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, డ్రామా, డాక్యుమెంటరీ ఇలా అన్ని జానర్లలో సినిమాలు అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులకు పండుగ వాతావరణం నెలకొంది.

  • By: sn |    movies |    Published on : Feb 06, 2026 8:19 AM IST
OTT Movies | ఓటీటీలో ఒక్కరోజే 19 సినిమాల డిజిటల్ రిలీజ్.. అన్ని జానర్ల వినోదం ప్రేక్షకుల ముందుకు

OTT Movies | ఓటీటీ ప్రియులకు ఇవాళ భారీ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, డ్రామా, డాక్యుమెంటరీ ఇలా అన్ని జానర్లలో సినిమాలు అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులకు పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే, హెచ్‌బీవో మ్యాక్స్, హులు, ముబి, సోనీ లివ్ వంటి ప్రధాన ఓటీటీ వేదికలు ఈరోజు కొత్త కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో ‘ఫైండింగ్ హార్మోనీ’ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ, ‘ఎల్ఓఎల్’ అనే ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్, ‘వయోలెంట్ ఎండ్స్’ అనే అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘క్వీన్ ఆఫ్ చెస్’ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ, ‘సాల్వడార్’ స్పానిష్ యాక్షన్ డ్రామా సిరీస్, ‘ట్రాన్స్‌ఫార్మర్స్ వన్’ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ చిత్రం, ‘యో బెస్టీ’ సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ విడుదలయ్యాయి. జీ5లో ‘షాబాద్: రీత్ ఔర్ రివాజ్’ హిందీ స్పోర్ట్స్ డ్రామా సిరీస్, ‘నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్’ మలయాళ హారర్ కామెడీ, ‘జై’ కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సన్ నెక్ట్స్‌లో ‘నీలకంఠ’ తెలుగు రూరల్ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్, ‘మిండియమ్ పరాంజుమ్’ మలయాళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్‌స్టార్‌లో ‘ది రాజా సాబ్’ తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ విడుదల కాగా, లయన్స్ గేట్ ప్లేలో ‘మాతృ’ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది.

టెంట్‌కొట్టాలో ‘కోంబుసీవి’ తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. హెచ్‌బీవో మ్యాక్స్‌లో ‘బాయ్స్ గో టూ జూపిటర్’ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ చిత్రం, ముబిలో ‘లా గ్రేజియా’ రొమాంటిక్ కామెడీ డ్రామా, హుల్లో ‘స్ప్లిట్స్‌విల్లే’ రొమాంటిక్ కామెడీ, సోనీ లివ్‌లో ‘జాజ్ సిటీ’ హిందీ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలయ్యాయి. ఈరోజు విడుదలైన 19 కంటెంట్‌లలో ‘ది రాజా సాబ్’, ‘మాతృ’, ‘నీలకంఠ’, ‘నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్’, ‘వయోలెంట్ ఎండ్స్’, ‘జై’, ‘ఎల్ఓఎల్’, ‘కోంబుసీవి’, ‘ట్రాన్స్‌ఫార్మర్స్ వన్’ వంటి తొమ్మిది టైటిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అయితే ఈ స్పెషల్ లిస్ట్‌లో తెలుగులో ఆసక్తికరంగా ఉన్నవి కేవలం మూడు మాత్రమే కావడం గమనార్హం. మరో విశేషం ఏమిటంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక్కరోజే నాలుగు కొత్త సినిమాలు/సిరీస్‌లు విడుదల కావడం ఓటీటీ అభిమానులకు అదనపు ఆనందాన్ని అందిస్తోంది. మొత్తంగా చూస్తే ఈరోజు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వినోదప్రియులకు విభిన్నమైన కంటెంట్‌ను ఒకేసారి అందించి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొత్త ఊపు తీసుకొచ్చాయి.