విధాత: మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి తలనొప్పిగా మారినట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ నేతలు రోజుకొకరు అధికార పార్టీ అధినేత కేసీఆర్, లేదా కేటీఆర్‌తో సమావేశమై కండువా మారుస్తున్నారు.
తాజాగా ఆ పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
చేనేత రంగం అబివృద్ధికి కేసీఆర్ చేపట్టిన చర్యలు అభినందనయమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ చేనేతపై జీఎస్టీ వేయడం దారుణమని ఆనంద భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.