విధాత: మునుగోడు నియోజకవర్గం దండు మల్కాపురంలో బీజేపీ చీఫ్ నడ్డాకు గ్రామస్థులు సమాధి నిర్మించారు. ఇది ఇప్పుడు నియోజవర్గం లో తీవ్ర చర్చనీయాంశమైంది.
2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో నియోజకవర్గంలో పర్యటించిన నడ్డా.. దండు మల్కాపురం పరిధిలో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు.
స్తల కేటాయింపు జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. పనుల్లో పురోగతి లేకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. ఫ్లోరైడ్ భాదితులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నేరవేర్చక పోవడంతో నడ్డాకు సమాది గట్టి నిరసన తెలియ జేశారు.
అదేవిధంగా మునుగోడులో మరోమారు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేఖంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఓటును అమ్ముకుంటావో… బతికున్న శవంగా మారతావో తేల్చుకోవాలని మునుగోడు ఓటర్ కు సవాల్ విసిరారు. పబ్లిక్ కు అల్టిమేటం జారీ చేస్తూ వెలసిన పోస్టర్ల పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.