Bank Privatization | ఇక బ్యాంకుల విలీనం లేనట్టే..! ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వరంగ బ్యాంకులు..!

Bank Privatization | గత కొన్నేళ్ల కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసింది. దీంతో ప్రస్తుతం దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. 2017 నాటికి దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు 27 వరకు ఉండేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై భవిష్యత్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడం లేదు.

  • Publish Date - May 21, 2024 / 12:00 PM IST

Bank Privatization | గత కొన్నేళ్ల కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసింది. దీంతో ప్రస్తుతం దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. 2017 నాటికి దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు 27 వరకు ఉండేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై భవిష్యత్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడం లేదు. బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంపై దృష్టి సారిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది.

ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదని కేంద్రం వద్ద లేదని జాతీయ మీడియా పేర్కొంది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ విలీనం చేస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో జరిగిన విలీన ప్రక్రియతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. విలీనానికి ముందు చాలా బ్యాంకులకు భారీగా ఎన్‌పీఏలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వం ఈ బ్యాంకులకు మూలధనాన్ని చొప్పించడమే కాకుండా, పెద్ద ఎత్తున బ్యాంకులను విలీనం చేసింది. ఈ కారణంగా బ్యాంకుల నిర్వహణ, నిర్వహణ ఖర్చులు ఆదా అయ్యాయి.

ఐడీబీఐ బ్యాంక్‌ నుంచే పెట్టుబడుల ఉపసంహరణ

సమాచారం మేరకు.. కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరం ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించబోతున్నది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ప్రభుత్వం 45 శాతం వాటా ఉన్నది. ఎల్‌ఐసీకి 49.24శాతం వాటా ఉన్నది. కేంద్రం, ఎల్‌ఐసీ కలిసి ఐడీబీఐలో 60.7శాతం వాటాను విక్రయించాలని భావిస్తున్నది. వాటాల విక్రయంతో ప్రైవేట్‌రంగ బ్యాంక్‌గా మారబోతున్నది. ఐడీబీఐలో వాటాలను కొనుగోలు చేసేందుకు సీబీఎస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ కోరికను వ్యక్తం చేశాయి.

తగ్గిన ఎన్‌పీఏలు.. లాభాల్లో బ్యాంకులు

ప్రస్తుతం బ్యాంకులు లాభాల బాట పట్టాయని మింట్‌ ఓ నివేదిక తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో బ్యాంకుల ప్రైవేటీకరణపై మింట్‌ సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకుల ఎన్‌పీఏలు భారీగా తగ్గిపోయాయి. దాంతో ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌, ఆర్‌బీఐ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఐడీబీఐ మినహా మరే ఇతర బ్యాంకును ప్రైవేటీకరించే ప్రతిపాదన ప్రస్తుతం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కానీ, భవిష్యత్తులో ప్రైవేటీకరణ జరిగే అవకాశాలున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించాలనే కోరికను కూడా వ్యక్తం చేశారు.

Latest News