మహారాష్ట్ర ముంబైలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ బధిర యువతిపై అత్యాచారం జరగడంతో ఆమె గర్భం దాల్చింది. 17 మంది అనుమానితులకి డీఎన్‌ఏ పరీక్ష (DNA tests) నిర్వహించగా.. షాకింగ్ నిజం బయటపడింది. యువతి గర్భం దాల్చడానికి కారణం తండ్రే అని డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా బయటపడింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ముంబై (Mumbai)లోని కఫ్ పరేడ్ ప్రాంతంలో నివాసం ఉండే 20 ఏళ్ల బధిర యువతి గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్యానికి గురైంది. కడుపులో ఇబ్బందిగా అనిపించడంతో నానమ్మకు చెప్పింది. దీంతో ఆమె యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ యువతికి పరీక్షలు చేయగా.. ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. బాధితురాలిని విచారించేందుకు ప్రయత్నించగా.. వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. యువతికి మూగ, చెవిటి ఉండటంతో ఆమె వాంగ్మూలాన్ని తీసుకోలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఇక ఆమె తండ్రిని విచారించారు. అయితే, అత్యాచారం ప్రశ్నను యువతి తండ్రి కొట్టిపారేశాడు. అంతేకాదు ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా నిరాకరించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని నిర్ణయించారు.
తండ్రితోపాటూ యువతితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 17 మంది డీఎన్‌ఏ శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని యువతి కడుపులో పెరుగుతున్న బిడ్డ శాంపిల్స్‌తో టెస్ట్ చేయగా.. షాకింగ్ నిజం బయటపడింది. ఈ టెస్ట్‌లో యువతి తండ్రి డీఎన్‌ఏ మ్యాచ్ అయ్యింది. ఇది చూసిన అధికారులు, వైద్యులు, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అనంతరం బాధితురాలి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తండ్రితోపాటూ మరో ఇద్దరి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
