EPFO | మారిన ఈపీఎఫ్‌ రూల్స్‌.. అవేంటో తెలుసుకోండి..!

EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. కరోనా సమయంలో తీసుకువచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని తాజాగా నిలిపివేస్తున్నట్లు నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

  • Publish Date - June 16, 2024 / 09:17 AM IST

EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. కరోనా సమయంలో తీసుకువచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని తాజాగా నిలిపివేస్తున్నట్లు నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. కరోనా కారణంగా ఉద్యోగాల కోత, వేతన కోత తదితర సమస్యల నేపథ్యంలో ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా పీఎఫ్‌ను ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది. ఈఫీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. తాజాగా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఉపసంహరణ నిబంధనలను మార్చింది.

కరోనా మహమ్మారి లేనందువల్ల అడ్వాన్స్ మొత్తం తీసుకునే అవకాశాన్ని నిలిపివేసినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. రెండో వేవ్ సమయంలో పునరుద్ధరించింది. దాదాపు నాలుగేళ్లు ఇది అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ.. ఆ తర్వాత పలుమార్లు పునరుద్ధరించారు. తాజాగా మరోసారి నిలిపివేశారు. అడ్వాన్స్ సదుపాయం నిలిచిపోయినప్పటికీ ఇంటి కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం తదితర సందర్భాల్లో ఈపీఎఫ్‌ ఖాతా నుంచి నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించింది.

Latest News