Smart Lock
విధాత: భారతదేశంలో అత్యంత అనుకూలమైన స్మార్ట్ డోర్ లాక్ , గోద్రేజ్ అడ్వాంటిస్ జిఎస్ఎల్ డి1 ను లాక్స్ & ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ ఆవిష్కరించింది. గృహ భద్రత , నిర్మాణ పరిష్కారాల విభాగంలో అగ్రగామి అయిన గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌కు చెందిన లాక్స్ & ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ తాజా ఆవిష్కరణను విడుదల చేసింది. అడ్వాంటిస్ జిఎస్ఎల్ డి1 స్మార్ట్ డోర్ లాక్ అనేది ఆధునిక గృహ భద్రతలో ఒక పురోగతని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
రూ. 18,499/- ప్రారంభ ధరతో, ఆధునిక గృహాల కోసం భారతదేశంలో అత్యంత అధునాతన డిజిటల్ లాక్‌గా రూపోందించిందని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఫర్ ది వరల్డ్’ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.