విధాత : బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. సోమవారంతో పోల్చితే మంగళవారం దాదాపు రూ.2 వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.1,23,690గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,12,250గా నమోదైంది. వెండి కూడా తగ్గుదల దశగా అడుగులు వేసింది. నిన్నటితో పోల్చితే కిలో వెండి రూ. 7 వేలు తగ్గి.. రూ.1,50,300కు చేరింది.
బంగారం ధరలు పతనమవుతుండటంతో బంగారం కొనే వారికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే బంగారం ధర భారీగా తగ్గిందని తెలిపారు. ధరలు కొంచెం కొంచెంగా తగ్గుతుండటంతో చాలా మందికి ఇప్పుడు బంగారం కొనాలనే ఆసక్తి ఏర్పడుతుంది. ఇంకొందరు “ఇంకాస్త తగ్గాకే” అని వేచి చూస్తున్నారు. చాలా మంది ట్రెండ్ చూసి తొందరగా నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తం మీద ఎప్పుడు పెరుగుతుందో…ఎప్పుడు తగ్గుతుందో తెలియని పసిడి ధరలు కొనుగోలుదారుల మేధస్సుకు పరీక్షను పెడుతున్నాయంటున్నారు.
