silver price hike| వెండి ఒక్క రోజునే రూ.12వేలు పైకి..స్థిరంగా బంగారం

బంగారం, వెండి ధరలు రోజురోజుకు పైపైకి చేరుతున్నాయి. మంగళవారం వెండి ధర మరో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. కిలో వెండి ధర రూ.12,000పెరిగి రూ.3,87,000వద్ద కొనసాగుతుంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,61,950 వద్ధ నిలిచింది.

విధాత: బంగారం, వెండి ధరలు రోజురోజుకు పైపైకి చేరుతున్నాయి. మంగళవారం వెండి ధర మరో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. కిలో వెండి ధర రూ.12,000పెరిగి రూ.3,87,000వద్ద కొనసాగుతుంది. జనవరి 1న రూ.2,56,000గా ఉన్న కిలో వెండి ధర 26రోజుల్లో రూ.1లక్ష 31,000పెరుగడం వెండి ధరల దూకుడుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,61,950 వద్ధ నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,48,450వ్దద్ద కొనసాగుతుంది. జనవరి 1న తులం బంగారం ధర రూ.1,30,506గా ఉండటం గమనార్హం.

భారీగా పెరుగడం ఖాయం

వెండి ధరలు మునుముందు కూడా ఇదే స్థాయిలో భారీగా పెరుగుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్ విశ్లేషకులు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనాలమేరకు ద్రవ్యోల్బణం, ఫియాట్ కరెన్సీలు, బలహీన పడుతున్న డాలర్ విలువ, అమెరికా అప్పులు, పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాల క్రమంలో వెండి, బంగారం ధరలు మరింత భారీగా పెరుగుతాయంటున్నారు.వెండి ఔన్స్ ధర ప్రస్తుతం 100డాలర్ల మార్కును దాటిందని, అయితే ఏడాదిలో 200డాలర్లు దాటనుందని అంచనా వేశారు. అంటే భారత్ లో కిలో వెండి ధర త్వరలోనే రూ.6 లక్ష్లల మార్క్ దాటవచ్చు.

బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల పెట్టుబడిదారులకు రక్షణగా నిలుస్తాయని అందుకే వాటి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగారం ధర ప్రస్తుతం ఔన్స్ కు 5వేల డాలర్ల మార్క్ దాటిందని, రాబోయే సంవత్సరాల్లో 27వేల డాలర్లకు అంటే రూ.8.68లక్ష్లకు చేరవచ్చని కియోసాకి అంచనా వేస్తున్నారు.

 

Latest News