Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఖర్చుపై ఆసక్తికర వివరాలు.. ఆసియాలోనే బిగ్గెస్ట్ వెడ్డింగ్ అంటూ ఆడిటర్ కామెంట్స్

Virosh | టాలీవుడ్ లో గ‌త కొంత‌కాలంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలను కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. దాదాపు వారం రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకల్లో హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, ఫ్యాన్స్ మీట్, మీడియా మీట్, అన్నదాన కార్యక్రమాలు, స్వీట్స్ పంపిణి, ఆలయాల సందర్శనలు వంటి అనేక కార్యక్రమాలు జరిగాయి

Virosh | టాలీవుడ్ లో గ‌త కొంత‌కాలంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలను కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. దాదాపు వారం రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకల్లో హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, ఫ్యాన్స్ మీట్, మీడియా మీట్, అన్నదాన కార్యక్రమాలు, స్వీట్స్ పంపిణి, ఆలయాల సందర్శనలు వంటి అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలను చూసిన అభిమానులు, సినీ వర్గాలు ఇది చాలా గ్రాండ్ గా నిర్వహించిన పెళ్లి అని అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల విజయ్ దేవరకొండకు సన్నిహితుడైన ఆడిటర్ అనురాగ్ పర్వతనేని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఈ వివాహ వేడుక ఆసియాలోనే బిగ్గెస్ట్ వెడ్డింగ్స్ లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ జంటకు ఉన్న క్రేజ్ ఎంతటి స్థాయిలో ఉందో కూడా ఆయన వివరించారు. అనురాగ్ ప్రకారం, పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో రష్మిక మందన్న పెట్టిన పోస్టుకు సుమారు 26 మిలియన్ లైక్స్ వచ్చాయి. అలాగే విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టుకు సుమారు 21 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ రెండు పోస్టులను కలిపి దాదాపు 46 మిలియన్ లైక్స్ రావడం విశేషం. ఇప్పటి వరకు ఆసియాలో ఎక్కువ లైక్స్ వచ్చిన పోస్టుల్లో ఇది ఒకటిగా నిలిచిందని ఆయన చెప్పారు.

ఇదే కాకుండా ఈ జంట కలిసి చేసిన ఒక ప్రముఖ బ్రాండ్ యాడ్ కూడా భారీ స్పందన వ‌చ్చింద‌ని తెలిపారు. యూట్యూబ్ లో విడుదలైన ఆ యాడ్ కు ఇప్పటికే 34 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయని చెప్పారు. ఒక కపుల్ చేసిన యాడ్ కు ఈ స్థాయి వ్యూస్ రావడం ప్రపంచంలోనే అరుదైన విషయం అని ఆయన పేర్కొన్నారు. ఆ యాడ్ ను పెళ్లికి ముందే షూట్ చేసినప్పటికీ, పెళ్లి ప్రమోషన్ లా కనిపించేలా ప్లాన్ చేసి పెళ్లి తర్వాత విడుదల చేసినట్టు వెల్లడించారు.

పెళ్లి ఖర్చుల విషయానికి వస్తే, ఆడిటర్ గా అన్ని వివరాలు చెప్పడం కుదరదని అనురాగ్ అన్నారు. అయితే ఈ వేడుకలు పెద్దగా కనిపించినప్పటికీ ఖర్చు మాత్రం పరిమితంగానే జరిగినట్టు చెప్పారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వేడుకలకు సుమారు 20 నుండి 25 కోట్ల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

అలాగే ఈ జంట కలిసి చేసిన యాడ్ కు భారీ రెమ్యునరేషన్ అందుకున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఆ యాడ్ కోసం దాదాపు 15 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఆ యాడ్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే పెళ్లి ఖర్చులలో కొంత భాగం నిర్వహించారని కూడా టాక్ వినిపిస్తోంది.ఇంటర్వ్యూలో అనురాగ్ తనకు విజయ్ దేవరకొండ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ తండ్రి ద్వారా తన పరిచయం ఏర్పడిందని తెలిపారు. అప్పటి నుంచి వారి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నానని చెప్పారు. కాలక్రమేణా ఆ అనుబంధం మరింత బలపడిందని తెలిపారు.

విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ ప్రారంభించిన తర్వాత తనకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అవకాశం లభించిందని చెప్పారు. ఆ తర్వాత కో ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసే అవకాశం దక్కిందని తెలిపారు. తన జీవితాన్ని విజయ్ దేవరకొండను కలిసే ముందు, కలిసిన తర్వాత అని రెండు భాగాలుగా చెప్పొచ్చని ఆయన భావోద్వేగంగా చెప్పారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి అనే చిత్రానికి కూడా తాను కో ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నానని అనురాగ్ తెలిపారు. భవిష్యత్తులో నిర్మాతగా కూడా సినిమాలు చేయాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News