Gold Rates | హైదరాబాద్ : రెండు రోజుల క్రితం వరకు ఉరుకులు పరుగులు పెట్టిన పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 90 వేలకు పైగా ఉన్న బంగారం ధరలు నిన్నటి నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న, ఇవాళ 90 వేలకు దిగువన బంగారం ధరలు నమోదు అయ్యాయి. దీంతో మగువలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,290(నిన్న రూ. 82,300), కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89,770 (నిన్న రూ. 89,780) లుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,330 (నిన్న రూ. 67,340) గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 1,09,900 (నిన్న రూ.1,10,000) గా పలుకుతోంది.
బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,290, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,770, ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,440, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89,970గా ఉంది.