CIBIL Score | మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి..!

CIBIL Score : మనిషి అనే ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు రుణం అవసరం పడుతుంది. చేసేది ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏదో ఓ సందర్భంలో రుణం అవసరం వస్తుంది. అయితే ఈ రోజుల్లో లోన్ సులువుగా లభ్యం కావాలంటే మంచి సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score) కలిగి ఉండాలి. CIBIL స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే లోన్ లేదా క్రెడిట్ కార్డు పొందడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

  • Publish Date - May 7, 2024 / 10:53 AM IST

CIBIL Score : మనిషి అనే ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు రుణం అవసరం పడుతుంది. చేసేది ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏదో ఓ సందర్భంలో రుణం అవసరం వస్తుంది. అయితే ఈ రోజుల్లో లోన్ సులువుగా లభ్యం కావాలంటే మంచి సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score) కలిగి ఉండాలి. CIBIL స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే లోన్ లేదా క్రెడిట్ కార్డు పొందడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన సిబిల్‌ స్కోర్‌ ఎప్పుడూ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలె. మరె సిబిల్ స్కోర్ పెరగాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టైమ్‌ టు టైమ్‌ చెల్లింపులు

మీ సిబిల్ స్కోర్ పేలవంగా ఉండటానికి ముఖ్య కారణాలలో ఒకటి రుణ వాయిదాల చెల్లింపులో ఆలస్యం చేయడం. తప్పనిసరిగా గడువులోగా చెల్లింపులు చేయాలి. తరచూ గడువు తేదీ మార్చిపోతున్నాం అంటే ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సకాలంలో చెల్లింపులు చేస్తేనే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది.

క్రెడిట్ రిపోర్టులో లోపాలు

మనం తీసుకున్న రుణం పూర్తిగా తిరిగి చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ లోపాల కారణంగా లోన్ ఇంకా యాక్టివ్‌గా ఉంటుంది. అది మన క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పాత లోన్స్ క్లోజ్ అయిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి క్లియర్ చేసుకుంటే సిబిల్ స్కోర్‌ను పెంచుకోవచ్చు.

బాకీ పెండింగ్‌ పెట్టొద్దు

మీ CIBIL స్కోర్‌ మెరుపడాలంటే పాత బాకీలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా బకాయి ఉండొద్దు. పాత బాకీ పెండింగ్‌ ఉంటే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుంది. కాబట్టి బకాయిలు ఉంటే వెంటనే చెల్లించండి.

లోన్ గ్యారెంటర్‌గా ఉండటం

మీరు లోన్‌ తీసుకున్న వ్యక్తితో జాయింట్ అకౌంట్ హోల్డర్‌గా ఉన్నా, లేదంటే లోన్ తీసుకున్న వాళ్లకు గ్యారెంటర్ ఉన్నా వాళ్లు రుణ వాయిదాలు సరిగా చెల్లించకపోతే మీ సిబిల్‌ స్కోర్‌ దెబ్బతింటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు లోన్ గ్యారంటర్‌గా ఉండకుండా ఉండే ప్రయత్నం చేయండి.

ఎక్కువ రుణాలు తీసుకోవద్దు

మన అవసరాన్ని బట్టి ఒకేసారి ఒక రుణాన్ని మాత్రమే తీసుకోవాలి. సకాలంలో తిరిగి చెల్లించాలి. పరమితికి మించి రుణాలు తీసుకోవడం ద్వారా బకాయి చెల్లింపులో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.

దీర్ఘకాలిక రుణం బెటర్‌

మీరు లోన్ తీసుకునేటప్పుడు దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకుంటే మంచిది. దాంతో EMI తక్కువగా ఉంటుంది. దాంతో నెలనెలా చెల్లింపు కూడా సులభం అవుతుంది. దాంతో మీరు డిఫాల్టర్‌ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. సకాలంలో చెల్లింపులు చేస్తుండటంవల్ల మీ క్రెడిట్ స్కోర్‌ మెరుగుపడుతుంది.

Latest News