Mobile Phones | వాయిదాలు ఎగ్గొడితే మొబైల్ ఫోన్లు లాక్.. ఆర్.బీ.ఐ పరిశీలన

Mobile Phones | మీరు ఈఎంఐ విధానంలో మొబైల్ తీసుకుని, ఆ తరువాత క్రమం తప్పకుండా ఇన్ స్టాల్ మెంట్లు చెల్లించకపోతే మీ ఫోన్ ఆటోమెటిక్ గా లాక్ అవుతుంది. దీనిపై సెంట్రల్ బ్యాంక్ పరిశీలన చేస్తున్నదని ఆర్.బీ.ఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు తెలిపారు.

Mobile Phones | హైదరాబాద్, విధాత : మీరు ఈఎంఐ విధానంలో మొబైల్ తీసుకుని, ఆ తరువాత క్రమం తప్పకుండా ఇన్ స్టాల్ మెంట్లు చెల్లించకపోతే మీ ఫోన్ ఆటోమెటిక్ గా లాక్ అవుతుంది. దీనిపై సెంట్రల్ బ్యాంక్ పరిశీలన చేస్తున్నదని ఆర్.బీ.ఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు తెలిపారు.

మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన తరువాత ఈఎంఐ లు చెల్లించడం లేదని పలు ఆర్థిక సంస్థలు భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. బకాయిలు పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని, ఫోన్ డిజిటల్ లాక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరాయి. దీనిపై సెంట్రల్ బ్యాంకు యాజమాన్యం పరిశీలన చేస్తున్నట్లు రాజేశ్వర్ రావు ఇవాళ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలు అమలు చేయడం వల్ల కలిగే లాభ నష్టాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. డిజిటల్ లాకింగ్ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంతో ఇటు వినియోగదారులకు, అటు ఆర్థిక సంస్థలకు రెండు వైపులా లాభ నష్టాలు ఉన్నాయని అన్నారు. వీటిని సమతూకం చేస్తూ వినియోగదారుల హక్కులు, డేటా ప్రైవసీ కాపాడాల్సిన బాధ్యత ఉందని రాజేశ్వర్ రావు వెల్లడించారు.

Exit mobile version