Site icon vidhaatha

Motorola Edge 50 | త్వరలో మార్కెట్‌లోకి మోటోరోలా ఎడ్జ్‌50 అల్ట్రా మొబైల్‌.. భారత్‌లో లాంచ్ డేట్‌, స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

Motorola Edge 50 | అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ త్వరలో లాంచ్‌ చేయనున్నది. అయితే, ఈ మోడల్‌పై చాలారోజుల నుంచి బజ్‌ నెలకొన్నది. ఎప్పుడు లాంచ్‌ అవుతుందన్నది తెలియరాలేదు. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఎక్స్​టీ 2401-1 మోడల్​ నంబర్‌తో వస్తున్న మోటరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా గ్యాడ్జెట్‌కి ఇటీవల బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ వచ్చింది. ఈ సర్టిఫికేషన్‌ లభించిందంటే త్వరలోనే మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లుగా అర్థం ఆసియా, యూరప్‌, లాటిన్‌ అమెరికాలో లాంచ్‌ అయిన కొద్ది సమయానికిలో భారత్‌లో బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ పూర్తయ్యిందని టాక్‌.

ఎడ్జ్ 50 అల్ట్రా త్వరలో భారత్‌లో లాంచ్‌ అవనుండగా.. ఎడ్జ్ 50ప్రో స్మార్ట్​ఫోన్​ ఏప్రిల్‌లో భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఎడ్జ్ 50 అల్ట్రా ఇండియన్‌ వెర్షన్‌పై మోటోరోలా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మోడల్‌ యూరోపియన్ వెర్షన్‌లో ఉన్న ఫీచర్స్‌ దాదాపు భారత్‌లో లాంచ్‌ అయ్యే మోడల్స్‌లో కనిపించనున్నాయి. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 6.7 ఇంచ్​ సూపర్ హెచ్​డీ పీఓఎల్​ఈడీ డిస్‌ప్లే, 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 144 హెర్ట్‌జ్‌ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 2800 నిట్స్ వరకు గరిష్ఠంగా బ్రైట్​నెస్​, 360 హెర్ట్‌జ్‌ టచ్ శాంప్లింగ్ రేటు, హెచ్‌డీఆర్‌ 10ప్లస్‌ సర్టిఫికేషన్‌ కలిగి ఉన్నది.

ముందు భాగంలో 3డీ కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఎడ్జ్ 50 అల్ట్రా ఫ్రేమ్ శాండ్​బ్లాస్టెడ్​ అల్యూమినియంతో రూపొందించింది. ఈ ఫోన్​కి ఐసీ 68 వాటర్​ డస్ట్​ రెసిస్టెన్స్​ సపోర్ట్​తో రానున్నది. అడ్రినో 735 జీపీయూతో కనెక్ట్​ చేసిన స్నాప్​డ్రాగన్​ 8ఎస్ జెన్ 3 చిప్​సెట్​ సెటప్‌ ఉంటుంది. 16 జీబీ వరకు ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​తో రానున్నది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కు అనువుగా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ ఛార్జర్ లేదంటే 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఈ అల్ట్రా మోడల్‌ ఎప్పుడు లాంచ్ అవనున్నది ? స్పెసిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు సైతం వెల్లడి కావాల్సి ఉన్నది.

Exit mobile version