Smart Phones | రూ.10 వేల బ‌డ్జెట్‌లో.. అదిరిపోయే ఫోన్లు ఇవే

Smart Phones | మార్కెట్ ప్ర‌కారం కొత్త త్రైమాసికం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో భార‌తీయ వినియోగ‌దారులు ఎక్కువ‌గా ఆశ్ర‌యించే బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఏమి అందుబాటులో ఉన్నాయో ఓ లుక్ వేసేద్దాం. రూ.10 వేల లోపు ధ‌ర ఉండి, 4 జీబీ ర్యాం, ఎక్కువ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, మంచి డిస్‌ప్లే, కాస్త నీట్‌గా ఫొటోలు తీసే కెమేరా వంటి ఫీచ‌ర్ల‌తో ఉన్న కొన్ని ప్ర‌ముఖ మొబైల్స్ ప్ర‌స్తుతం సంద‌డి చేస్తున్నాయి. అవేంటంటే.. పోకో సీ 55 ఈ జాబితాలో 6 […]

  • Publish Date - July 24, 2023 / 10:28 AM IST

Smart Phones |

మార్కెట్ ప్ర‌కారం కొత్త త్రైమాసికం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో భార‌తీయ వినియోగ‌దారులు ఎక్కువ‌గా ఆశ్ర‌యించే బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఏమి అందుబాటులో ఉన్నాయో ఓ లుక్ వేసేద్దాం. రూ.10 వేల లోపు ధ‌ర ఉండి, 4 జీబీ ర్యాం, ఎక్కువ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, మంచి డిస్‌ప్లే, కాస్త నీట్‌గా ఫొటోలు తీసే కెమేరా వంటి ఫీచ‌ర్ల‌తో ఉన్న కొన్ని ప్ర‌ముఖ మొబైల్స్ ప్ర‌స్తుతం సంద‌డి చేస్తున్నాయి. అవేంటంటే..

పోకో సీ 55

ఈ జాబితాలో 6 జీబీ ర్యాం అందించే ఏకైక ఫోన్ పోకో సీ 55. 128 ఇంట‌ర్న‌ల్ జీబీతో పాటు మెమొరీ కార్డ్ స్లాట్‌ను సైతం అందిస్తోంది. 6.71 అంగుళాల డిస్‌ప్లే తో 1650 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజొల్యూష‌న్ ఇస్తుంది. మీడియాటెక్ జీ85 ఎస్ఓసీ మైక్రోప్రాసెస‌ర్‌తో పోకో సీ 55 ల‌భిస్తోంది. వెనుక వైపున ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఇవ్వ‌డం ద్వారా సెక్యూరిటీకి కూడా ప్రాముఖ్యం ఇచ్చింది.

ధ‌ర: రూ.8499, 6 జీబీ ర్యాం, 128 జీబీ మెమొరీ

వెనుక వైపున క్లాసీ లుక్ తో ఆక‌ట్టుకుంటున్న ఈ ఫోన్ .. లెద‌ర్ టైప్ మెటీరియ‌ల‌త్ బిల్డ్ ఇన్ అయింది. దీనివ‌ల్ల ప్రీమియం ఫోన్ ఎక్స్‌పీరియ‌న్స్ వ‌స్తుంది. పీడీఏఎఫ్, డెప్త్ సెన్స‌ర్‌ల‌తో 50 మెగా పిక్స‌ల్ ప్రైమ‌రీ కెమెరా స‌హా డ్యూయ‌ల్ కెమెరాను పోకో అందిస్తోంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాట‌రీ వ‌ల్ల రోజుల పాటు ఫోన్‌కు ఛార్జింగ్ అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఆండ్రాయిడ్ 12తో ప‌నిచేసే పోకో సీ 55 ప‌నిచేస్తుంది.

మోటోరోలా జీ 13

బ‌డ్జెట్ ఫోన్ల‌లో మ‌రో మంచి హ్యాండ్‌సెట్ మోటోరోలో జీ 13. 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వీడీయో ఎక్స్‌పీరియ‌న్స్ బాగుంటుంది. 50 మెగాపిక్స‌ల్ ప్రైమ‌రీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్ సెన్స‌ర్‌, 2 ఎంపీ మాక్రో కెమెరాల‌ను ఇన్‌బిల్ట్ చేశారు. సెల్ఫీల కోసం ఫోన్ స్క్రీన్‌పైన 8 ఎంపీ కెమేరాను ఇచ్చారు. ఐపీ 52 వాట‌ర్ ప్రూఫ్ టెక్నాల‌జీ బాడీని వాడ‌టంతో ఫోన్‌కు రిచ్ లుక్ వ‌చ్చింది.

ధ‌ర‌: రూ.9,999, 4 జీబీ ర్యాం, 128 జీబీ మెమొరీ

మీడియా టెక్ హెలియో జీ85ను ప్రాసెస‌ర్‌గా ఉప‌యోగించారు. 128 జీబీ ఇంటర్న‌ల్ మెమోరీ, 4 జీబీ ర్యాంల‌ను ఇచ్చారు. దీనికి కూడా 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఉంది. మోటోరోలా జీ 13కు ఆండ్రాయిడ్ 13ను ఇవ్వ‌డం విశేషం. అంతేకాకుండా మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామ‌ని, ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను కూడా ఉచితంగా ఇస్తామ‌ని సంస్థ ప్ర‌క‌టించింది. క్లియ‌ర్ అండ్ క్లీన్ ఆప‌రేష‌న్ ఉండే ఫోన్లు కావాలంటే మోటో ఒక మంచి ఆప్ష‌న్‌.

రియ‌ల్ మీ నార్జో 50 ఏ

కొన్ని రోజుల క్రితం రూ.15 వేల శ్రేణిలో ఉన్న రియ‌ల్ మీ నార్జో 50 ఏ ఇప్పుడ రూ.10 వేల విభాగంలోకి వ‌చ్చింది. అందుకే దీనిలో కాసిన్ని ఎక్కువ ఫీచ‌ర్లు కూడా ఉంటాయి. స్టైలిష్ డిజైన్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. అయితే మోటోతో పోలిస్తే ఇందులో 60 హెర్ట్జ్ రిఫ్రెష్‌మెంట్ రేట్‌నే ఇచ్చారు. ఇది ఒక ప్ర‌తికూల అంశం. ఇదీ కూడా హెలియో జీ85 ప్రాసెస‌ర్‌తోనే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11తో వ‌స్తున్న ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యాం, 128 జీబీ ఇంట‌ర్నెల్ మెమోరీ సామ‌ర్థ్యం ఉంది.

ధ‌ర‌: రూ.9,999, 4 జీబీ ర్యాం, 128 జీబీ మెమొరీ

మోటో త‌ర‌హాలోనే 50 ఎంపీ ప్రైమ‌రీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్స‌ర్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా ఫొటోల‌ను అందంగా తీర్చిదిద్దుతాయి. 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీల‌కు పోజులివ్వ‌చ్చు. బ్యాట‌రీ సామ‌ర్థ్యంలో మాత్రం ఒక అడుగు ముందుకు వేసి దీనికి 6000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం ఇచ్చారు. అంతే కాకుండా 18 వాట్ ఫాస్ట్ ఛార్జ‌ర్‌తో చాలా త‌క్కువ స‌మ‌యంలో ఫుల్ బ్యాట‌రీని పొందొచ్చు. అంతే కాకుండా ఈ ఫోన్‌తో ఇత‌ర గ్యాడ్జెట్ల‌కు ఛార్జింగ్‌ ఎక్కించుకునేలా రివ‌ర్స్ ఛార్జింగ్ సౌక‌ర్య‌మూ ఉంది.

రెడ్ మీ 12 సి

మీడియా టెక్ హెలియో జీ 85 ఎస్ఓసీ ప్రాసెస‌ర్‌తో ల‌భిస్తున్న మ‌రో ఫోన్ రెడ్ మీ 12 సి. 6.71 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో చేతిలో ఇమిడిపోతుంది. 1650 x 720 పిక్స‌ల్ సామ‌ర్థ్యంతో 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది.

ధ‌ర‌: రూ.9,499, 4 జీబీ ర్యాం, 128 జీబీ మెమొరీ

4 జీబీ ర్యాం, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ ర్యాం, ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ల‌తో ఆధునిక ఫీచ‌ర్ల‌ను అందిస్తోంది. డెప్త్‌ సెన్సర్‌తో 50 ఎంపీ ప్రైమ‌రీ కెమెరాను ఇవ్వ‌గా.. సెల్ఫీల‌కు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుప‌రిచారు. దీనికి ఉన్న 500 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో బేసిక్ ఫీచ‌ర్ల‌తో రోజున్న‌ర వ‌ర‌కు ఛార్జింగ్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

నోకియా సీ 32

లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13తో ఈ శ్రేణిలో ల‌భిస్తున్న రెండో ఫోన్ నోకియా సీ 32. ఇదీ కూడా మోటో త‌ర‌హాలోనే నియ‌ర్ స్టాక్ యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది. అంటే ఏ మాత్రం గంద‌రగోళం లేని ఇంట‌ర్‌ఫేస్ దీని సొంతం. ఈ జాబితాలో ఏ ఫోన్‌కూ లేని దృఢ‌మైన గ్లాస్ బాడీని నోకియా సీ 32కి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ధ‌ర‌: రూ.9,499, 4 జీబీ ర్యాం, 128 జీబీ మెమొరీ

6.52 అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లేకు ర‌క్ష‌ణ‌గా గ్లాస్‌ను సైతం ఇన్‌బిల్ట్‌గా వ‌స్తోంది. అవ్వ‌డానికి బ‌డ్జెట్ ఫోన్ అయిన‌ప్ప‌టికీ రిచ్‌, క్లాసీ లుక్‌లో దీనికి పోటీ లేదు. ఆటో ఫోక‌స్ ఫీచ‌ర్‌తో 50 ఎంపీ ప్రైమ‌రీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సీ 32 ల‌భిస్తోంది. దీనికి కూడా 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇవ్వ‌డంతో ఛార్జింగ్‌కూ ఇబ్బంది ప‌డ‌క్క‌ర్లేదు.

Latest News