Infinix Mobile | భారత మార్కెట్‌లోకి జీటీ20 ప్రొ మోడల్‌ని లాంచ్‌ చేసిన ఇన్ఫినిక్స్‌..! ఫీచర్స్‌.. ధర ఎంతో తెలుసా..?

Infinix Mobile | హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఇన్ఫినిక్స్‌ భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్‌ చేసింది. ప్రత్యేకంగా గేమింగ్‌ ప్రియులను దృష్టిలో పెట్టుకొని జీటీ20 ప్రో ఫోన్‌ని తీసుకువచ్చింది. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధర, బుకింగ్స్‌కు వివరాలు చూసేద్దాం.

  • Publish Date - May 23, 2024 / 10:30 AM IST

Infinix Mobile | హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఇన్ఫినిక్స్‌ భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్‌ చేసింది. ప్రత్యేకంగా గేమింగ్‌ ప్రియులను దృష్టిలో పెట్టుకొని జీటీ20 ప్రో ఫోన్‌ని తీసుకువచ్చింది. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధర, బుకింగ్స్‌కు వివరాలు చూసేద్దాం. జీటీ20 ప్రో మొబైల్‌ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ ప్లే, రిఫ్రెష్ రేట్ అప్ టూ 144 హెర్ట్‌జ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్‌పై నడుస్తున్నది. మీడియా టెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ఎస్ఓసీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ఉన్నది. పిక్సెల్ వర్స్క్ ఎక్స్5 టర్బో గేమింగ్ చిప్ సెటప్‌ ఉన్నది. ఎక్స్ బూస్ట్ గేమింగ్ మోడ్‌ఓ 90ఎఫ్‌పీఎస్‌ తో గేమ్స్ ఆడుకునేందుకు వీలుంటుంది.

రియర్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ సెటప్‌ ఉంది. 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం 6 ప్రైమరీ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్స్‌ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. మొబైల్‌ వెనుక వైపున ప్రత్యేకంగా డిజైన్‌ ఉన్నది. ఆర్జీబీ మినీ ఎల్ఈడీ అర్రే, సీ షేప్ రింగ్‌తో ఆకర్షణీయమైన లైటింగ్ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. 8 కలర్ కాంబినేషన్లు, 4 నాలుగు లైటింగ్ ఎఫెక్ట్స్ యూజర్లకు సరికొత్త అనభూతిని ఇవ్వనున్నది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. జేబీఎల్ డ్యూయల్ స్పీకర్స్ ఉండగా.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్‌, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

మొబైల్‌ బరువు బరువు 194 గ్రాముల వరకు ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే బ్యాంకు ఆఫర్‌తో 8జీబీ, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ మొబల్‌ రూ. 22,999గా నిర్ణయించింది కంపెనీ. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ మొబైల్‌ ధర రూ.24,999గా నిర్ణయించింది. మెచా బ్లూ, మెచా ఆరెంజ్, మెచా సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్డ్‌లో ఈ నెల 28 నుంచి షురూ కానున్నాయి. కాగా, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో సౌదీ అరేబియాలో ఏప్రిల్‌లో విడుదల కాగా.. ప్రస్తుతం భారత మార్కెట్‌లో లాంచ్‌ అయ్యింది.

Latest News