Silver all time high| వెండి ఆల్ టైమ్ రికార్డు ధర.. కిలో రూ.3.07లక్షలు

భోగి పండుగ వేళ వెండి, బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1.090పెరిగి రూ.1,43, 620కి పెరిగింది. కిలో వెండి ధర రూ.15,000పెరిగి ఆల్ టైమ్ రికార్డు ధర రూ.3,07,000కి చేరింది.

విధాత: భోగి పండుగ వేళ వెండి, బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1.090పెరిగి రూ.1,43, 620కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ రూ.1000పెరిగి రూ.1,31,650కి చేరింది. గత ఐదు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ రావడం గమనార్హం.

వెండి ధరలు మరింత పైకి..

సంక్రాంతి పండుగ వేళ వెండి ధరలు సైతం మరింత పెరిగాయి. కిలో వెండి ధర రూ.15,000పెరిగి ఆల్ టైమ్ రికార్డు ధర రూ.3,07,000కి చేరింది.జనవరి 1న కిలో వెండి ధర రూ.2,56,000మాత్రమే ఉండగా..రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రూ.51,000పెరగడం వెండి ధరల జోరుకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో వెండి ఔన్సుకు 88.37 డాలర్ల వద్ద ట్రేడవుతూ.. చరిత్రలోనే అతి గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కేవలం 13 నెలల్లో వెండి 210 శాతం పెరిగి, బంగారం, ప్లాటినం వంటి ఇతర విలువైన లోహాలను అధిగమించడం గమనార్హం.

యుఎస్ , చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, విలువైన లోహాల ధరలలో హెచ్చుతగ్గులు వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ సూచికలో మార్పులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు, బాండ్ రాబడుల హెచ్చుతగ్గులు ప్రపంచ వెండి విలువపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ అస్థిరత్వం, అమెరికా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు, ఇరాన్ సంక్షోభం, ట్రంప్ నిర్ణయాలు వంటి పరిణామాలు అన్ని కూడా వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. వెండి ధరల పరుగుకు పెట్టుబడిదారులు ప్రపంచ మార్కెట్లు వెండి సురక్షితమైన ఆస్తిగా, అలాగే పారిశ్రామిక ముఖ్య లోహంగా పెరిగిన డిమాండ్ కూడా కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రపంచంలో వెండి ప్రధాన ఉత్పత్తిదారులైన మెక్సికో, చైనా, పెరూలలో వెండి సరఫరా-డిమాండ్ లోటు పెరిగిపోవడం కూడా వెండి ధరల విపరీత పెరుగుదలకు కారణంగా మారింది.

Latest News