విధాత : అవును నేను మలయాళ(Malayalam) అమ్మాయిని కాదు.. మా అమ్మ (శ్రీదేవి) కూడా మలయాళీ కాదని.. కానీ కేరళ సంస్కృతికి..మలయాళ సినిమాలకు నేను అభిమానంటూ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాన్వీ నటించిన ‘పరమ్ సుందరి’ (Param Sundari)సినిమా ట్రైలర్ విడుదల అనంతరం జాన్వీపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. కేరళ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో నటించేందుకు మలయాళ హీరోయిన్స్ లేరా? అంటూ గాయని పవిత్రా మీనన్‌లాంటి వారు ప్రశ్నించారు. ఈ వివాదం(Malayalam controversy)పై జాన్వీ కపూర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నేను మలయాళ అమ్మాయిగానే కాదు సినిమాలో తమిళ అమ్మాయిగానూ కనిపిస్తానని వెల్లడించారు. కేరళ యువతి, ఢిల్లీ యువకుడి ప్రేమకథే ఇది వినోదాత్మక రొమాంటిక్ కామెడీ మూవీ అని పేర్కొన్నారు.
తుషార్ జలోటా దర్శకత్వంలో రూపొందిన ‘పరమ్ సుందరి’ సినిమాలో కేరళ యువతిగా జాన్వీ కపూర్ , ఢిల్లీ యువకుడిగా సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) నటిస్తున్నారు. వారిద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఈ సినిమా ఇతివృతం. అయితే ఉత్తరాది అమ్మాయి జాన్వీ కపూర్ ను మళయాళీ అమ్మాయిగా చూపించడంపై విమర్శలు చెలరేగాయి. దీనిపై జాన్వీ కపూర్ వివరణ ఇచ్చింది. నటనకు భాషా, ప్రాంత భేదాలుండవని వ్యాఖ్యానించింది. పాత్రలో ఎంతవరకు మెప్పించామన్నదే ప్రధానమని స్పష్టం చేసింది. తెలుగులో దేవరతో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి మాదిరిగా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సాధించాలని తపిస్తుంది. తాజాగా రామచరణ్ సరసన పెద్ది సినిమాలో, దేవర 2లో జాన్వీ నటిస్తుంది.