MSVG | బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ తాండవం ..‘మన శంకర వరప్రసాద్ గారు’తో పుష్ప రికార్డ్స్ బ్రేక్..

MSVG | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు (MSVG)’ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో సంచలనం సృష్టిస్తోంది. వింటేజ్ చిరు లుక్, పక్కా ఫ్యామిలీ కంటెంట్, ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

MSVG | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు (MSVG)’ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో సంచలనం సృష్టిస్తోంది. వింటేజ్ చిరు లుక్, పక్కా ఫ్యామిలీ కంటెంట్, ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కామెడీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, మెగాస్టార్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఒకవైపు హృదయాన్ని తాకే ఫ్యామిలీ ఎమోషన్, మరోవైపు నవ్వులు పూయించే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో, విడుదలైన నాటి నుంచి టికెట్ కౌంటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై పడింది.

విడుదలైన కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘మన శంకర వరప్రసాద్ గారు’. అంతేకాదు, ఈ సినిమా అనేక సరికొత్త రికార్డ్స్‌ను కూడా క్రియేట్ చేసింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ మెగాస్టార్ సినిమా అల్లు అర్జున్ నటించిన పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ రికార్డ్స్‌ను కూడా అధిగమించిందట. పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన ‘పుష్ప’ ఓవరాల్‌గా సుమారు రూ.350 కోట్ల కలెక్షన్స్ సాధించగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ మాత్రం కేవలం 18 రోజుల్లోనే రూ.358 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త చరిత్ర సృష్టించినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

ఇప్పటికీ థియేటర్లలో ప్రేక్షకుల హడావుడి తగ్గలేదు. రోజురోజుకూ ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుండటంతో, రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూ.400 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మైలురాయి నిజమైతే, రీజనల్ సినిమాల్లో ఈ స్థాయి వసూళ్లు సాధించిన హీరోగా మెగాస్టార్ చిరంజీవి మరో సరికొత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంటాడు. వింటేజ్ మాస్‌కు ఫ్యామిలీ ఎమోషన్ జతచేసిన చిరంజీవి మేజిక్ ఇంకా ఎంత దూరం వెళ్లబోతుందో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Latest News