Peddi | యూరప్‌కు ‘పెద్ది’ టీమ్ .. రామ్ చరణ్ కెరీర్‌లోనే కొత్త మలుపు తిప్పనున్న స్పోర్ట్స్ డ్రామా

Peddi |  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Peddi |  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ తదుపరి షెడ్యూల్‌ను దర్శకుడు బుచ్చిబాబు యూరప్ లొకేషన్లలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి చివర్లో చిత్రబృందం యూరప్‌కు వెళ్లనుందని టాక్. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌పై ఒక కీలక పాటతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇదివరకే గత డిసెంబర్‌లో ఢిల్లీలో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ పూర్తిచేయగా, ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ కొంత భాగాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం మిగిలిన షూటింగ్‌ను ఈ నెలలోనే పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలనే ప్లాన్‌లో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

కథలో అనూహ్య మలుపులు?

‘పెద్ది’ కథలో క్లైమాక్స్ అత్యంత భావోద్వేగంగా ఉండబోతోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కథలో హీరో పాత్ర భారీ ప్రమాదానికి గురై శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా, చివరకు తన సంకల్పంతో విజేతగా నిలిచే విధానం ప్రేక్షకులను కదిలిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పాత్రను రామ్ చరణ్ ఇంతకుముందెన్నడూ చేయలేదని, ఇది ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలవనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే భారీ హైప్

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో పాటు ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లోని సిగ్నేచర్ షాట్ చరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం.

భారీ తారాగణం – పాన్ ఇండియా రిలీజ్

‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ‘మిర్జాపూర్’ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఉత్తరాంధ్ర గ్రామీణ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకునే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News