Site icon vidhaatha

Venkatesh | వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి సినిమాల్లో హీరోయిన్‌ మారింది..! తెలుగు బ్యూటీ ఐశ్వర్య రాజేశ్‌కు ఛాన్స్‌..?

Venkatesh | విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం అనిల్‌ రావిపుడితో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించనున్నారు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో వెంకీ మార్క్‌ ఎంటర్‌నైనర్‌గా ఉండనున్నదని తెలుస్తున్నది. ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ అమ్మడి ప్లేస్‌లో తెలుగు బ్యూటీని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తున్నది. కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.

ఐశ్వర్య తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. తాజాగా వెంకటేశ్‌ మూవీలో ఛాన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నది. సినిమాతో తెలుగులో మరోసారి బ్యూటీ తన అదృష్టం పరీక్షించుకోనున్నది. తెలుగులో ఒక్క హిట్ పడితే మాత్రం ఐశ్వర్య లక్‌ మారనున్నది. మరి వెంకటేశ్‌ మూవీతోనైనా అదృష్టం కలిసి వస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నది. తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నది. తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్‌దాస్‌, తీయవర్ కులైగల్ నడుంగ, మలయాళంలో అజాయంతే రందం మోషణం, హర్‌, కన్నడంలో ఉత్తరఖాండ చిత్రాల్లో నటిస్తున్నది.

Exit mobile version