Allu Arjun | అల్లు – కొణిదెల కుటుంబాల మధ్య దూరం ఇంకా పెరిగిందా?

మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషితో నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగి, ఎందరికో మార్గదర్శిగా నిలిచి, మానవత్వంలో కూడా మెగాస్టార్గా నిరూపించుకున్న మహానటుడు

  • Publish Date - June 8, 2024 / 03:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. స్వయంకృషితో నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగి, ఎందరికో మార్గదర్శిగా నిలిచి, మానవత్వంలో కూడా మెగాస్టార్గా నిరూపించుకున్న మహానటుడు. ఆయన వారసత్వం అందిపుచ్చుకుని, తన అండతో తమనుతాము నిరూపించుకున్న నటులు ఆ కుటుంబంలో ఎందరో. కానీ, తమ టాలెంట్తో తమ కాళ్లమీద తాము నిలదొక్కుకుని ఉన్నత శిఖరాలకు చేరింది మాత్రం ఇద్దరే. వారు రామ్‌చ‌రణ్ (Ramcharan), అల్లు అర్జున్ (Allu Arjun).

చిరంజీవి సతీమణి సురేఖ సోదరుడు అల్లు అరవింద్. తన కుమారుడే అల్లు అర్జున్(Allu Arjun). ‘గంగోత్రి’ సినిమాతో కథానాయకుడిగా సినిమారంగ ప్రవేశం చేసిన బన్నీ, ‘ఆర్య’తో పరిశ్రమలో నిలదొక్కుకోగలిగాడు. తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నాడు. ముఖ్యంగా డాన్స్లో తన ప్రతిభ అనన్యసామాన్యం. అలా ఒక్కోమెట్టూ ఎక్కుతూ, అగ్రహీరోగా పేరు తెచ్చుకున్నాడు. అన్ని రకాల పాత్రలు చేస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. కానీ, చిరంజీవి ఛత్రం నుండి బయటపడలేకపోయాడు. తనను మెగా కుటుంబసభ్యుడిగానే ప్రజలు పరిగణించారు.

2014లో విడుదలైన ‘రేసుగుర్రం’ చిత్రం నుండి అర్జున్ యాటిట్యూడ్లో మార్పు మొదలైంది. మెగా కుటుంబసభ్యుడిగా కొనసాగడం ఇష్టం లేదన్నట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వరుసగా, ‘సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అల వైకుంఠపురంలో..’ సినిమాలు భారీ హిట్లుగా నిలవడంతో ఆ ఫీలింగ్ కాస్తా ఎక్కువయింది. బహిరంగంగానే తను కొణిదెల కుటుంబంతో దూరం పెంచుకున్నాడు.

ఇండియాలో ఎవరికీ లేనటువంటి క్యారవాన్ ‘బీస్ట్’ను కొన్నాడు. లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. వాటిని ప్రదర్శించాడు. పాలకొల్లులో తాతయ్య అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో అల్లు ఫ్యామిలీ(Allu Family) అని ప్రకటించుకున్నాడు. ‘పుష్ప’ (Pushpa)తో సీన్ పూర్తిగా మారిపోయింది. అనూహ్యంగా ఆ సినిమా దేశవ్యాప్తంగా బంపర్హిట్ అవడం ఒకెత్తు అయితే, అర్జున్ జాతీయ ఉత్తమనటుడి(National Best Actor) అవార్డు గెలుచుకోవడం ఇంకొక ఎత్తు. ఒక తెలుగు నటుడికి ఆ అవార్డు రావడం అదే ప్రథమం.

దాంతో రాత్రికిరాత్రి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప–2 (Pushpa-2)కు 120 కోట్ల పారితోషికం అందుకుని హైయెస్ట్ పెయిడ్ స్టార్గా పేరుగాంచాడు. ఇక్కడితో బంధువుల కథ సమాప్తం. మేం వేరే, వాళ్లు వేరే అనే స్థాయికి ఐకన్ స్టార్ చేరుకున్నాడు. అప్పుడప్పుడూ ఏ పుట్టినరోజు సందర్భాలలో వేసే ట్వీట్లు తప్ప, నేరుగా కుటుంబాటు కలిసిన సందర్భాలు అరుదు. అది కూడా తండ్రి అరవింద్ బలవంతం మీదనే. మొత్తానికి చిరంజీవి కుటుంబపు నీడ తన మీద పడకుండా, అల్లు కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. కొణిదెలకుటుంబసభ్యులు కూడా ఈ మార్పును గమనించి తమ మానాన తాము మిన్నకుండిపోయారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలు ఈ కుటుంబ గొడవలను తారాస్థాయికి చేర్చాయి. చిరంజీవి తమ్ముడు, పవర్స్టార్ పవన్కళ్యాణ్(Pavan Kalyan) రాజకీయాలలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. తను పిఠాపురం (Pithapuram) నుండి పోటీ చేయగా, అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల (Nandyal) నుండి లోక్సభకు వైసీపీ తరపున పోటీ చేసాడు. దాంతో స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి రోడ్షో ద్వారా ప్రచారం నిర్వహించిన అర్జున్, పవన్‌ను కనీసం పలకరించడానికి కూడా వెళ్లలేదు.

అదేరోజు రామ్‌చ‌రణ్, తన తల్లిని తీసుకుని పిఠాపురం వెళ్లి బాబాయిని కలిసి మద్దతు ప్రకటించి, అభిమానులనుద్దేశించి ప్రసంగించాడు. పవన్ పేరిట ఓ ట్వీట్ పడేసిన అర్జున్ ఆభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఎన్నికల ఫలితాలలో ఒక్కసారిగా పవన్‌క‌ళ్యాణ్ పూర్తి గెలుపు (Pavan Kalyan 100% strike rate) సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి, కేంద్రంలో మోదీ ప్రధాని కావడానికి హేతువు కావడంతో మెగా ఫ్యామిలీలో అనందానికి హద్దులేకుండా పోయింది. అర్జున్ స్నేహితుడు నంద్యాలలో ఘోరంగా ఓడిపోవడం కూడా మరో పరిణామం.

నిన్న పవన్‌క‌ళ్యాణ్, తన అమ్మ, అన్నయ్య వదినల ఆశీర్వాదం కోసం సతీపుత్ర సమేతంగా హైదరాబాద్ వచ్చాడు. ఆ సందర్భంలో కొణిదెల కుటుంబసభ్యులందరూ ఉన్నారు ఒక్క అల్లు కుటుంబం తప్ప. దాంతో ఈ రచ్చ మరింత రాజుకుంది. అభిమానుల మధ్య మంటలు పుట్టాయి. అల్లు అర్జున్ జీవితమే చిరంజీవి ప్రసాదం అనే అభిమానులు సోషల్ మీడియాలో సెగలు రేపారు. దానికి కౌంటర్గా అల్లు అభిమానులు బదులివ్వడం..ఇలా సాగుతోంది. అయితే ఇద్దరు సమానస్థాయి నటులను పోల్చిచూడటం సహజం.

పుష్ప సినిమాతో అర్జున్ జాతీయ ఖ్యాతినందుకున్న సమయంలోనే చిరంజీవి తనయుడు రామ్‌చ‌రణ్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రానికి ఆస్కార్(OSCAR) అవార్డు రావడం, చరణ్కు జాతీయంగా, అంతర్జాతీయంగా గొప్ప పేరు రావడం కాకతాళీయమే అయినా, ఇద్దరి గుణగణాలను పోల్చిచూస్తే, రామ్‌చ‌రణ్ నెమ్మదస్తుడు(Ramcharan humble). తండ్రిలాగే చాలా వినయంగా ఉంటాడు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడతాడు. చాలా హుందాగా వ్యవహరిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు.

దానికి పూర్తి వ్యతిరేకంగా అర్జున్ దూకుడు స్వభావిగా, పొగరుగా (Arrogant Bunny), ఎవరు చెప్పినా వినడని, నేనేం తక్కువన్నట్లుగా ప్రవర్తిస్తాడని పరిశ్రమలో పేరుగాంచాడు. ఇది తనకు ఇబ్బందికరంగా మారబోతోంది. ఇప్పుడు కొణిదెల కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన పలుకుబడిలో ఉంది. ఒక పక్క చిరంజీవి పద్మవిభూషణ్(Padma Vibhushan) అవార్డు అందుకోవడం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)కి సన్నిహితుడు కావడం, ఇప్పుడు పవన్కళ్యాణ్ ఏకంగా మోదీ పక్కనే కూర్చుని చర్చలు జరిపే స్థాయికి చేరుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ఉపముఖ్యమంత్రి (Deputy CM of AP)గా ఎదగడం అల్లు అర్జున్కు మింగుడుపడని విషయమే.

నిజానికి ఎవరైనా ఒకరి సహాయంతో ఎదిగితే, అది తప్పేంకాదు కదా. దానికి సహాయపడ్డవారు కూడా సంతోషించే విషయమే అది. అల్లు అర్జున్ను కూడా చిరంజీవి కుటుంబం ఎప్పుడూ దూరంపెట్టలేదు. తనంత తానుగా దూరమయ్యాడు. అగ్రస్థానం, డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. వినయం, హుందా ప్రవర్తనలే మనిషికి గౌరవాన్ని కల్పిస్తాయి. కొణిదెల కుటుంబంతో దగ్గరిగా ఉంటే, అల్లు కుటుంబపు పరువేం పోదు కదా.

పైగా ఒక పెద్ద సినీకుటుంబంగా పెద్దపెద్ద స్టార్లున్న ఫ్యామిలీగా అందరికీ గౌరవం లభిస్తుంది. ఒకవేళ రానున్న సినిమాలు దురదృష్టవశాత్తు ఆడకపోతే, అర్జున్ పరిస్థితి ఏమిటి? ఎవరు అండగా ఉంటారు? ఎవరు ఓదార్పునిస్తారు? పాపం.. అల్లు అరవింద్ అటు బావగారికి ముఖం చూడలేక, ఇటు కొడుక్కీ చెప్పలేక అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కుపోయాడు. అహంకారానికి, పొగరుకు గుణపాఠంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణ.

 

Read More

KALKI 2898

AD | కల్కి 2898 ఏడిలో భారీ తప్పిదం

Prabhas | ప్ర‌భాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయ‌న కోట్ల ఆస్తులు ఎవ‌రికి చెందుతాయి..!

Rashmika| ఎన్టీఆర్‌కే ర‌ష్మిక కండీష‌న్స్ పెడుతుందా.. అలా అయితేనే న‌టిస్తుందట‌..!

Manchu Lakshmi| మోహన్ బాబుకి చెప్ప‌కుండా మంచు ల‌క్ష్మీ పెళ్లి.. ఆమె మొద‌టి భ‌ర్త ఎవరంటే..!

Latest News