Manchu Lakshmi| మోహన్ బాబుకి చెప్ప‌కుండా మంచు ల‌క్ష్మీ పెళ్లి.. ఆమె మొద‌టి భ‌ర్త ఎవరంటే..!

Manchu Lakshmi| మంచు మోహ‌న్ బాబు ముద్దుల కూతురు మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌య‌లు అక్క‌ర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేసింది. కాని ఇప్పుడు కాస్త త‌గ్గించి సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. హాట్ హా

  • Publish Date - June 9, 2024 / 07:38 PM IST

Manchu Lakshmi| మంచు మోహ‌న్ బాబు ముద్దుల కూతురు మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌య‌లు అక్క‌ర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేసింది. కాని ఇప్పుడు కాస్త త‌గ్గించి సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ఇక మంచు ల‌క్ష్మీకి సంబంధించి అప్పుడ‌ప్పుడు కొన్ని విష‌యాలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. తాజాగా మంచువారి ఆడపడుచు లక్ష్మీ మొదటి భర్తకు సంబంధించిన న్యూస్ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. మంచు లక్ష్మి మొదటి భర్త గురించి , ఆమె మొదట పెళ్లి గురించి ఎవ‌రికి అంత‌గా తెలియ‌దు.

ఈమె చ‌దువుకుంటున్న స‌మ‌యంలో కాలేజ్ స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంద‌ట‌. తమ ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో ఆమె ఇంట్లో చెప్ప‌కుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. మోహ‌న్ బాబు ఊర్లో లేని స‌మ‌యంలో ఆర్య స‌మాజ్‌లో తాను ప్రేమించిన శ్రీనివాస్ అనే వ్య‌క్తిని పెళ్లాడింది. అయితే కొన్ని రోజుల‌కి అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. అందుకు కార‌ణం మోహ‌న్ బాబు అని టాక్. మంచు ల‌క్ష్మీ ఇంట్లో నుండి బ‌య‌ట‌కు వెళ్లి పెళ్లి చేసుకున్న త‌ర్వాత కుటుంబ స‌బ్యుల‌ని , బంధువుల‌ని ఆమెకి దూరంగా పెట్టార‌ట‌. రౌడీల‌తో బెదిరించార‌ట‌. ఆ స‌మ‌యంలో తండ్రితో తేల్చుకుందామ‌ని ఇంటికి వ‌చ్చి మ‌ళ్లీ కాలు బ‌య‌ట పెట్ట‌లేక‌పోయింద‌ట‌. అయితే త‌న భ‌ర్త‌కి ఇబ్బంది క‌ల‌గ‌కూడద‌నే విష‌యంలో మంచు ల‌క్ష్మీ విడాకులు తీసుకుంద‌ని చెబుతుంటారు.

ఆ త‌ర్వాత మోహన్ బాబు తన కూతురుని ఇండియాలో ఉంచకుండా అమెరికా పంపించి థియేటర్ ఆర్ట్స్ లో చేర్పించారట. అక్కడ కూడా ఒక ఫారెన్ సీరియల్ ఆర్టిస్ట్ తో లక్ష్మీ ప్రేమలో పడింద‌ట‌. ఇక మోహ‌న్ బాబుకి ఈ విష‌యం తెలియ‌డంతో వెంట‌నే ఆయ‌న ఆండ్రు శ్రీనివాస్ తో మంచు లక్ష్మి పెళ్లి జరిపించారట . ఇప్పుడు వారికి ఓ అమ్మాయి సంతానంగా ఉంది. అయితే మంచు లక్ష్మీ ప్రేమ వార్తలు కొన్ని నిజాలు ఉన్నా.. కొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోయాయి. అసలు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చారు అనేదానిపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు కాని ఆమె జీవితంలో మంచు మోహన్ బాబు విల‌న్‌గా మిగిలిపోయాడ‌ని టాక్.

Latest News