Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలోని రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, పాటలతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.
ఈ చిత్రానికి రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రీడా నేపథ్యంతో రూపొందిన కథ కావడంతో ఆయన పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. గతంలో ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా మెప్పించినట్లే, ‘పెద్ది’లో కూడా నేచురల్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, రఫ్ మేకోవర్ సినిమాకు హైలైట్ అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్పెషల్ సాంగ్‌పై ఆసక్తి
ప్రస్తుతం ఈ సినిమాలో ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ పాటలో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మొదట మృణాల్ ఠాకూర్ పేరు వినిపించినా, డేట్స్ సమస్యల కారణంగా ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం సమంత, పూజా హెగ్డే పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం.
అయితే తాజా టాక్ ప్రకారం, ఈ స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేయడానికి సంయుక్త మీనన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె చేసిన ఐటమ్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సంయుక్త కూడా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పాటకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్ అందించినట్లు సమాచారం. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. కాగా, సంయుక్త మీనన్… సాయి ధరమ్ తేజ్‌తో కలిసి విశ్వంభరలో కలిసి నటించి మంచి హిట్ అందుకున్న విషయం విదితమే.
విడుదల వాయిదా
మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తాజాగా విడుదలను జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. టాకీ పార్ట్ దాదాపు పూర్తయినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
టెక్నికల్‌గా అత్యుత్తమ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో మరింత సమయం తీసుకుంటున్నామని వారు స్పష్టం చేశారు. దీంతో జూన్‌లో రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
