Anasuya | సోషల్ మీడియాలో అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

Anasuya | సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.

Anasuya | సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, నల్గొండ జిల్లాకు చెందిన చంటి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@chantidhorapally) ద్వారా అనసూయపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు, పోస్టులు చేస్తున్నాడు. ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, గౌరవానికి భంగం కలిగించేలా కంటెంట్ ప్రచారం చేస్తున్నారని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు…

ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. అనంతరం నల్గొండలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులు సోషల్ మీడియా వినియోగంపై ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎవరిపై అయినా అసభ్యకర పోస్టులు, దూషణలు, వ్యక్తిగత దాడులు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాను సమాచార మార్పిడి, విజ్ఞానానికి ఉపయోగించాలే తప్ప, ఇతరులను కించపరచడానికి వాడకూడదని సూచించారు.

ఐటీ చ‌ట్టం కింద కేసులు..

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సెలబ్రిటీలు తరచూ ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో, ఈ కేసులో అనసూయ భరద్వాజ్ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం పట్ల సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియాలో బాధ్యతాయుత ప్రవర్తన అవసరం, సైబర్ నేరాలపై చట్టాల అమలు ఎంత కీలకమో స్పష్టమైంది.

Latest News