అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం

అజిత్ బెల్జియంలో జరిగిన 24H సిరీస్ రేసులో తన జట్టుతో రెండో స్థానం సాధించి మరోసారి భారత్ గర్వపడేలా చేశారు.

అంతర్జాతీయ కారు రేసులో నటుడు అజిత్(తలా) బృందం మరో విజయం సాధించింది. తన సొంత జట్టుతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ సత్తా చాటిన ‘తలా’ విజయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. బెల్జియంలోని ప్రఖ్యాత ‘సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్’ ట్రాక్‌పై జరిగిన 24H సిరీస్ ఎండ్యూరెన్స్ రేసులో అజిత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. హోరాహోరీగా సాగిన ఈ రేసులో అజిత్ కుమార్ టీమ్ రెండో స్థానాన్ని (P2) కైవసం చేసుకుంది.

గెలుపు అనంతరం పోడియంపై అజిత్ భారత జెండాను రెపరెపలాడించారు. పోడియంపై అజిత్ సంబరాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశం గర్వించేలా చేసిన కోలీవుడ్ స్టార్ అంటూ.. ‘సూపర్బ్ తలా’ అంటూ అజిత్ కుమార్‌పై నెటిజన్లు, అభిమానుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

‘మిస్ ఇండియా 2026’ విజేత సాధ్వి సైల్
టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా

Latest News