Pattudala Ott: ఓటీటీకి వచ్చేసిన.. అజిత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్

Pattudala Ott:
విధాత ప్రత్యేకం: తమిళనాట రజనీకాంత్ స్థాయిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆగ్ర హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సుమారు రెండేండ్ల విరామం తర్వాత నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ విదాముయార్చి. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఫిబ్రవరి 06 గురువారం తమిళంతో పాటు తెలుగులో పట్టుదల (Pattudala) పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని అవాంతరాల అనంతరం థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా నెల రోజుల లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ: అజర్‌బైజాన్ (Azerbaijan) అనే దేశంలో ఓ అమెరికన్ కంపెనీలో అర్జున్ (అజిత్) ఉద్యోగం చేస్తూ భార్య కాయల్ (త్రిష)తో కలిసి బాకూ అనే సిటిలో నివసిస్తూ ఉంటాడు. పెళ్లైన ఎనిమిదేండ్లకు గర్బవతి అయిన కాయల్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ప్రెగ్నెన్సీ కోల్పోతుంది. అప్పటి నుంచి భార్యభర్తలిద్దరు ముభావంగా, మనసు వికలం చెంది సరిగ్గా కలిసి ఉండలేక పోతారు. కొన్నాళ్ల తర్వాత కాయల్ తనకు మరో వ్యక్తితో సంబంధం ఉందని అర్జున్‌కు చెప్పి విడాకులు తీసుకుందామని కోరుతుంది. ఆపై తన అమ్మవాళ్ల ఇంటికి వెళతానన్న కాయల్‌ను అర్జున్ స్వయంగా కారులో తీసుకెళుతుండగా మధ్యలో వారి కారు బ్రేక్‌డౌన్ అవుతుంది. Pattudala Review సరిగ్గా అదే సమయంలో ఈ రూట్లో వెళుతున్న రక్షిత్ (అర్జున్), దీపిక (రెజినా) లను పరిచయం చేసుకుని కాయల్‌ను దగ్గర్లోని హోటల్ వద్ద దింపాలని కోరుతారు.
కారు బాగయ్యాక అక్కడి వెళ్లిన అర్జున్‌కు తన భార్య కనిపించదు. ఇక్కడికి అలాంటి వారెవరూ రాలేదని అక్కడి వాళ్లు చెబుతారు. దీంతో అర్జున్ ఓ ట్రక్‌ను ఫాలో అయి రక్షిత్‌ను తన భార్య గురించి అడగ్గా నాకు ఏం తెలియదని, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానని చెబుతాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం ఉండదు. ఆపై హోటల్ దగ్గర ఓ క్లూ ద్వారా లభించగా కాయల్‌ను కావాలని కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలో అసలు కాయల్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారు, దీని వెనకాల ఉన్న సూత్రధారి ఎవరు, రక్షిత్, దీపికల బ్యాగ్రౌండ్ ఏంటి, అర్జున్ తన చుట్టూ ఉన్న పద్మవ్యూహాన్ని ఎలా చేధించాడు, చివరకు కాయల్‌ను కనిపెట్టగలిగాడా, విడాకులు తీసుకున్నారా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మూవీ మొదటి 10 నిమిషాలు బాగా లాగ్ చేసినట్లు అనిపించినప్పటికీ కారు రోడ్డెక్కింది మొదలు సినిమా అయిపోయేంత వరకు తల తిప్పుకోకుండా చివరి వరకు సస్పెన్స్ మెయుంటెన్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్‌లో వచ్చే సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలవగా మిస్సయిన భార్యను వెతికే క్రమంలో వచ్చే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తమిళంతోతో పాటు తెలుగు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునే వారు ఈ సినిమాను మిస్ చేయవద్దు. 1997లో హాలీవుడ్‌లో వచ్చిన బ్రేక్‌డౌన్ (Breakdown), 2022లో వచ్చిన లాస్ట్ సీన్ ఎలైవ్ (Last Seen Alive) అనే సినిమాల అధారంగా తెరకెక్కిన ఈ మూవీని పూర్తిగా అజర్‌బైజాన్ నేపథ్యంలో అక్కడే చిత్రీకరించడం విశేషం.