జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు. 10 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడే ఛాన్స్.

విధాత : జపాన్ ఉత్తర తీరంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనల తీవ్రత జపాన్‌లో 7.4గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు పౌరులకు సూచించారు. భూకంపానికి హొక్కైడో, ఆఓమోరి, ఇవాటే ప్రాంతాలు ఎక్కువ ప్రభావితమయ్యాయి.

ఉత్త‌ర జపాన్ తీరానికి దూరంగా పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీట‍ర్ల లోతులో సంభవించింది. భూకంపం సంభవించింది. తీర ప్రాంతం హొక్కైడో ప్రాంతంలో గరిష్టంగా మూడు మీటర్ల (10 అడుగులు) మేర అలలు ఎగసి పడొచ్చని జపాన్‌ మెట్రోలాజికల్‌ ఏజెన్సీ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు ఉత్తర జపాన్‌లో సన్రికు ప్రాంతంలో భూంకంపం సంభవించింది. సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

జపాన్‌లోని ఉత్తర తోహోకు ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య రేవు ‘హచినోహే పోర్ట్’ నుంచి నౌకలు వెంటనే తరలిపోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలలు త్వరలో తీరానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టోక్యో నుంచి ఆఓమోరి వరకు బుల్లెట్ రైలు సేవలను భూకంపం తర్వాత నిలిపివేసినట్లుగా తెలిపారు.

జపాన్‌లో భూకంపం కారణంగా జారీ చేసిన సునామీ హెచ్చరికల ప్రభావం మన దేశంపై ఉండబోదని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (INCOIS) వెల్లడించింది. సునామీ ఏర్పడిన కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకే దాని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఏదైన అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంటే ముందస్తు హెచ్చరికలు విడుదల చేస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

‘మిస్ ఇండియా 2026’ విజేత సాధ్వి సైల్
అమెరికా – ఇరాన్ మధ్య రేపు రెండో దశ శాంతి చర్చలు జరిగేనా!

Latest News