Rashmika| ఎన్టీఆర్‌కే ర‌ష్మిక కండీష‌న్స్ పెడుతుందా.. అలా అయితేనే న‌టిస్తుందట‌..!

Rashmika| ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డం అందుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్.ఇప్పుడు ఆయ‌న‌తో సినిమా చేసేందుకు హీరోయిన్స్ క్యూ క‌డుతున్నారు. అయితే ర‌ష్మిక మాత్రం ఎన్టీఆర్‌కే కండీషన్స్ పెడుతుంద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. యంగ్

  • Publish Date - June 8, 2024 / 04:07 PM IST

Rashmika| ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డం అందుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్.ఇప్పుడు ఆయ‌న‌తో సినిమా చేసేందుకు హీరోయిన్స్ క్యూ క‌డుతున్నారు. అయితే ర‌ష్మిక మాత్రం ఎన్టీఆర్‌కే కండీషన్స్ పెడుతుంద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసువస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించి అల‌రించ‌నున్నాడు. ఇందులో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్ న‌టిస్తుంది. ఇక విలాన్ గా నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అక్టోబ‌ర్ 10న చిత్రాన్ని విడుద‌ల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేక‌ర్స్

ఇక హృతిక్ రోష‌న్‌తో క‌లిసి వార్2 అనే సినిమా కూడా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీ పూర్త‌య్యాక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేశారు ప్రశాంత్ నీల్. అయితే తారక్ సినిమాలో చేసేందుకు త‌న‌కు ఎలాంటి స‌మ‌స్య లేద‌ని, కాక‌పోతే ఒక కండీష‌న్ పెట్టింది. ఇందులో డీగ్లామ‌ర్ పాత్ర అయితే చేయ‌న‌ని డైరెక్ట్‌గా చెప్పింద‌ట‌.వరుసగా డీగ్లామర్ ఒప్పుకోవడంవల్ల కెరీర్ దెబ్బతింటుందని, అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూడటం క‌ష్టం అవుతుంద‌న్న నేప‌థ్యంలో ర‌ష్మిక ఇలాంటి కండీష‌న్ పెట్టింద‌ట‌.

పుష్ప రెండు పార్ట్‌ల‌లో ర‌ష్మిక డీ గ్లామ‌ర‌స్‌గానే కనిపిస్తుంది. ఇక ఇటీవ‌ల వ‌చ్చిన యానిమ‌ల్ సినిమాలో చాలా రొమాంటిక్‌గా న‌టించి అల‌రించింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి ఆ రెండు లేకుండా త‌న పాత్ర‌ని డిజైన్ చేయాల‌ని అంటుంద‌ట‌. మ‌రోవైపు ఈ సినిమా కోసం ఏకంగా ఏడు కోట్ల పారితోషికం కూడా డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక ర‌ష్మిక‌ తెలుగులో విజయ్ దేవరకొండతో కొత్తగా ఓ సినిమా ఒప్పుకుంది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇద్ద‌రు క‌లిసి కొత్త సినిమా చేస్తే ప్రేక్ష‌కుల‌కి అంత‌కు మించిన ఆనందం ఏముంద‌ని అంటున్నారు.

Latest News