Aishwarya Rai | విడాకుల రూమర్స్‌కు చెక్.. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఫోటో షేర్ చేసిన ఐశ్వర్య-అభిషేక్

Aishwarya Rai | సినీ రంగంలో చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో మరింత వేగంగా పాకిపోతాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఆదర్శ జంటగా పేరుగాంచిన అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ఇటీవల వచ్చిన విడాకుల రూమర్స్ పెద్ద చర్చకు దారితీశాయి.

Aishwarya Rai | సినీ రంగంలో చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో మరింత వేగంగా పాకిపోతాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఆదర్శ జంటగా పేరుగాంచిన అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ఇటీవల వచ్చిన విడాకుల రూమర్స్ పెద్ద చర్చకు దారితీశాయి.

ఇప్పటి వరకు వివాదాలకు దూరంగా ఉన్న ఈ జంట అకస్మాత్తుగా విడిపోతున్నారన్న వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ రూమర్స్‌ను ఖండించేందుకు ఇద్దరూ పరోక్షంగా పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ ప్రచారం ఆగలేదు.

యానివ‌ర్స‌రీ సెలబ్రేష‌న్స్..

అయితే తాజాగా తమ 19వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్, కూతురితో కలిసి దిగిన ఓ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా కేవలం హార్ట్ సింబల్ మాత్రమే జోడించడం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ ఫోటోతో ఇప్పటివరకు వచ్చిన విడాకుల రూమర్స్‌కు పుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం “ఇది రూమర్స్ ఎఫెక్ట్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రూమ‌ర్స్‌కి చెక్..

ఎవరెవరు ఏం కామెంట్ చేసినా, ఈ ఫోటో ద్వారా ఐశ్వర్య రూమర్స్‌కు గట్టి సమాధానం ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు. ఈ జంట మధ్య బలమైన బంధం ఉందని, చిన్నచిన్న గాసిప్స్‌తో అది దెబ్బతినదని ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.

ఇక వీరి ప్రేమ కథ విషయానికి వస్తే, ధూమ్ 2 సినిమా సమయంలో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది. 2007 జనవరి 14న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, అదే ఏడాది ఏప్రిల్ 20న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బ‌చ్చ‌న్ అధికారికంగా ప్రకటించారు.

వివాహానంతరం నాలుగేళ్లకు, 2011 నవంబర్ 16న ఈ జంటకు పండంటి ఆడపిల్ల జన్మించింది. అప్పటి నుంచి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న ఈ జంట, ఇండస్ట్రీలో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందింది.

Latest News