త్రిష లుక్ వెనుక ఐశ్వర్య రాయ్ స్టైల్? – విజయ్ ప్రమాణ స్వీకారంలో అందరి చూపు ఆమెపైనే..
తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో నటి త్రిషా కృష్ణన్ ఐస్-బ్లూ సిల్క్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె లుక్‌ను 2000లో ఐశ్వర్య రాయ్ ధరించిన క్లాసిక్ స్టైల్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష ధరించిన బ్లూ సారీ లుక్‌ను ఐశ్వర్య రాయ్ 2000 క్లాసిక్ స్టైల్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Aishwarya Rai Or Trisha Krishnan? Viral Saree Comparison Takes Over Social Media
విధాత వైరల్ డెస్క్ | మే 11, 2026 | హైదరాబాద్:
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు తిరిగిన రోజు అది. నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన సూపర్‌స్టార్ తలపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. అయితే ఆ వేడుక ముగిసే సమయానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పేరు మాత్రం ఒక్కటే — త్రిషా కృష్ణన్.
View this post on Instagram
ఐస్-బ్లూ రంగు సిల్క్ చీరలో ఎంతో సంప్రదాయబద్ధంగా, అదే సమయంలో రాచఠీవీతో త్రిష కార్యక్రమానికి హాజరైంది. విజయ్ తల్లిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు, అభిమానులకు నవ్వుతూ అభివాదం చేసిన వీడియోలు, స్టేడియం బయట ఆమె చుట్టూ అభిమానుల హడావిడి — ఇవన్నీ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వేడుకలో ఆమె భావోద్వేగానికి గురైన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
Aathi idhu epo….😭 Trisha getting emotional by Vijay’s speech today pic.twitter.com/T16K8ycBm6
— “ (@peekaboo_pr) May 10, 2026
పోతీస్ రూపొందించిన ఆ సిల్క్ చీరకు కస్టమ్ డిజైన్ బ్లౌజ్, డైమండ్-రూబీ జ్యువెలరీ, మల్లెలతో అలంకరించిన సిగ, మినిమల్ మేకప్, కాటుకతో కూడిన దక్షిణ భారత సంప్రదాయ చీరకట్టు — ఇవన్నీ కలిసి త్రిషను ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ “సింపుల్‌గా ఉన్నా రాయల్‌గా కనిపించింది” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
“ఇదే ఒరిజినల్”.. ఐశ్వర్య రాయ్ పాత ఫొటోలు మళ్లీ వైరల్
View this post on Instagram
ఓ పక్క త్రిష లుక్ వైరల్ అవుతుండగానే నెటిజన్లు వెంటనే మరో ఆసక్తికర పోలికను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రపంచసందరి, నటి ఐశ్వర్యారాయ్ 2000లో అప్పటి ప్రధాని అటల్ బిహీరీ వాజపేయిని కలిసిన సమయంలో ధరించిన ఐస్-బ్లూ చీర ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది.
అదే తరహా నీలిరంగు షేడ్, గోల్డ్ ఎంబ్రాయిడరీ, సంప్రదాయ హెయిర్‌స్టైల్, సాఫ్ట్ మేకప్ — ఇవన్నీ ఇప్పుడు త్రిష తాజా లుక్‌తో పోలుస్తూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. “నందిని అండ్ కుందవై” అంటూ ఒక యూజర్ ఇద్దరి ఫొటోలను కలిపి షేర్ చేయగా.. “ఇదే ఒరిజినల్ టెంప్లేట్” అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. (www.ndtv.com)
ఈ పోలికలకు మరో కారణం కూడా ఉంది. పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో ఐశ్వర్య రాయ్, త్రిష కలిసి నటించారు. సినిమాలో వారి పాత్రలైన “నందిని”, “కుందవై” పేర్లతో ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్, పోలికల పోస్టులు భారీగా వైరల్ అవుతున్నాయి. కాకతాళీయమే అయినా, ఒకరు ముఖ్యమంత్రితో, మరొకరు ప్రధానమంత్రితో ఒకేరకమైన డ్రెస్ కోడ్‌తో ఉండటం మాత్రం గమ్మత్తుగా కుదిరింది.
అయితే ఫ్యాషన్ ప్రేమికుల అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది. “ఇది కాపీ కాదు.. దక్షిణాది సంప్రదాయ అందానికి రెండు తరాల ప్రాతినిధ్యం మాత్రమే”అనీ, “ఇలాంటి చీరలు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కావు” అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram