NTR-Neel | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీ బిగ్ అప్‌డేట్.. మే 20న గ్లింప్స్, రిలీజ్ డేట్ ఎప్పుడంటే…!

NTR-Neel | ఎన్టీఆర్ , దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అభిమానుల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిత్రబృందం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.

NTR-Neel | ఎన్టీఆర్ , దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అభిమానుల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిత్రబృందం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లివిరిసింది. అంతేకాదు, అదే సమయంలో సినిమా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే సినిమా విడుదలకు దాదాపు 14 నెలల సమయం ఉండటంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

డ్రాగన్ వ‌ర‌ల్డ్ ప‌రిచ‌యం చేస్తారా..

ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఇదే పేరుతో సినిమాను పిలుస్తుండటం గమనార్హం. మే 20న విడుదలయ్యే గ్లింప్స్‌లో ఈ ‘డ్రాగన్ వరల్డ్’ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్లింప్స్ కోసం అవసరమైన ఫుటేజ్ సిద్ధంగా ఉండగా, ప్రస్తుతం దానికి ఫైనల్ టచ్‌లు ఇస్తున్నట్లు టాక్.

హీరోయిన్ల విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా రుక్మిణీ వసంతన్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోయిన్‌గా ఆలియా భట్ నటిస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అదేవిధంగా విలన్ పాత్రలో షాహిద్ కపూర్ కనిపించబోతున్నాడన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కాస్టింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

మొత్తానికి ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించగా, గ్లింప్స్ రిలీజ్ మరియు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు మే 20 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest News