హైదరాబాద్ : తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కూతురు పెళ్లి ఖర్చు కు సంబంధించిన వివాదంపై మూడునెలల్లో చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రజత్ కుమార్ కూతురు పెళ్లి విలాసవంతమైన తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌తో సహా హైదరాబాద్‌లోని వివిధ 5-నక్షత్రాల హోటళ్లలో 5 రోజుల పాటు ఘనంగా జరిగిందని..ఈ పెళ్లి ఖర్చును కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కంపెనీ మెగా కృష్ణారెడ్డి సంస్థ షెల్ కంపెనీల ద్వారా చెల్లించారని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నారాయణ్ పేట్ సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ డీవోపీటీలో(DoPT)కి పిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పిటిషనర్ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. శ్రీనివాస్ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై 3నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) దివన్, పిటిషనర్ తరపు న్యాయవాది అక్షయ్ మన్ వాదనలు వినిపించారు.
ఇవి కూడా చదవండి :
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
