తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేశారు. మే 1 నుంచి 31 వరకు బదిలీలకు అనుమతి. మూడేళ్లు పూర్తైనవారు బదిలీకి అర్హులు.
హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు దాటిన వారు బదిలీ కావడానికి అనుమతి మంజూరు చేసింది. నాలుగేళ్లకు మించి ఒకేచోట పోస్టింగ్‌లో ఉండరాదని ప్రభుత్వం పేర్కొంది. బదిలీలలో అవకతవకలకు అవకాశం లేకుండా కఠినమైన మార్గదర్శకాలు రూపొందించినట్లుగా సమాచారం. నాలుగు దశలలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.
2024లో చివరిసారిగా బదిలీలు చేపట్టిన ప్రభుత్వం… ప్రస్తుతం పాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ (సెన్సస్) ప్రక్రియలో ఉన్న వేలాది ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బదిలీల కసరత్తును అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆదేశాల ప్రకారం 2027 వరకు బదిలీలపై ఆంక్షలు ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధమైన విధులకు ఆటంకం కలగకుండా రాష్ట్ర అవసరాల దృష్ట్యా బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా గణన (Census) సంబంధిత పనుల కోసం నియమించబడిన ఉద్యోగుల విషయంలో ఈ ఉత్తర్వులు వర్తించబోవని, బదిలీలపై నిషేధం 2026 జూన్ 1వ తేదీ నుండి తిరిగి అమలులోకి వస్తుందని పేర్కొంది.
బదిలీల షెడ్యూల్
తొలి దశలో మే 1వ తేదీ నుంచి 7వ రోజు వరకు ఆర్థిక,సంబంధిత శాఖల ఉద్యోగుల యూనియన్లతో చర్చించి బదిలీ ప్రక్రియ ఖరారు చేస్తారు. రెండో దశలో మే 8నుంచి 15వరకు ఉద్యోగులు తమ ఐచ్ఛికాలతో (options) కూడిన దరఖాస్తులను సమర్పించాలి. మూడవ దశలో మే 16 నుండి 24వరకు దరఖాస్తుల పరిశీలన, బదిలీల విధానం ప్రకారం వాటిని క్రమబద్ధీకరించడం, కౌన్సెలింగ్, తదనుగుణంగా మాస్టర్ జాబితాను రూపొందించడం జరుగుతుంది. నాల్గవ దశ మే 25 నుంచి 31వ రోజు వరకు బదిలీ ఉత్తర్వులను జారీ చేయడం నిర్వహిస్తారు. ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుండి 3వ రోజున, సంబంధిత ఉద్యోగులు తమ పాత ఉద్యోగ స్థానం నుంచి విడుదలైనట్లుగా పరిగణిస్తారు.
ఇవి కూడా చదవండి :
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram