తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించింది. జూన్ 1 నుంచి బదిలీలను నిలిపివేస్తూ.. జీఓ 57 విడుదల చేసింది. ఆరు నెలల పాటు బదిలీలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లుగా పేర్కొంది. బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థికశాఖ ఏప్రిల్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని చదవండి :
మే 1 నుంచి 31 వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించింది. అప్పట్లోనే జూన్ 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం కొనసాగుతుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.