ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాణిజ్య అవసరాల కోసం పలు సంస్థలు తన పేరును, చిత్రాలను అనధికారికంగా ఉపయోగించుకుంటున్నాయని, వెంటనే వాటిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

Reported by: Y.V. Narsimha Reddy | సినిమా | Apr 17, 2026, 2:34 pm IST
Read Time: 1 mins
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌

విధాత : ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాణిజ్య అవసరాల కోసం పలు సంస్థలు తన పేరును, చిత్రాలను అనధికారికంగా ఉపయోగించుకుంటున్నాయని, వెంటనే వాటిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

అల్లు అర్జున్ పిటిషన్ ను విచారించిన జస్టిస్‌ తుషార్‌ రావు ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతున్నట్లు ఏఐ యాప్‌ సృష్టించారని, దేశవ్యాప్తంగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆయన తరపున న్యాయవాది స్వాతి సుకుమారన్‌ వాదించారు.