విధాత : నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కు అనూహ్యంగా ఓ యువతి నుంచి సైబర్ వేధింపులు(cyber harassment) ఎదురవ్వడం విస్మయం రేపింది. తనను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ వేదికగా అభ్యంతర పోస్టులు పెడుతున్న వ్యవహారంపై అనుపమ పరమేశ్వరన్ తాజాగా కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తనపై వేధింపులకు పాల్పడుతుందని ఓ యువతి అని తెలిసి ఆశ్చర్యపోయినట్లుగా అనుపమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
నా గురించి అసత్య ప్రచారం చేస్తున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కొన్ని రోజుల క్రితం నా దృష్టికి వచ్చిందని.. నా ఫ్యామిలీ, స్నేహితులు, నా సహ నటులే లక్ష్యంగా ఆ ఖాతాలో పోస్టులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఉండటంతో తీవ్ర ఆవేదన చెందానని అనుపమ తెలిపారు. అదే వ్యక్తి నన్ను ద్వేషిస్తూ మరికొన్ని ఫేక్ అకౌంట్లు సృష్టించినట్టు తర్వాత తెలిసిందని..దీంతో తాను కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి..ఆన్ లైన్ వేధింపుల వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తిని ఆధారాలతో కనిపెట్టడం జరిగిందన్నారు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి ఇదంతా చేసినట్లు తెలిసి ఆశ్చర్యపోయానని, ఆమెది చిన్న వయసు కావడం..తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను పూర్తి వివరాలు పంచుకోవాలని అనుకోవడం లేదుఅని..అయితే దీనిని ఇక్కడితే వదిలేయకుండా న్యాయపరంగానే ముందుకెళతానని అనుపమ తెలిపారు.
