విధాత, హైదరాబాద్ : మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కేసు నమోదైంది. శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు శ్రీకాంత్ అయ్యంగార్ పై కేసు నమోదు చేశారు.
తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మాగాంధీతో దేశానికి స్వాతంత్ర్యం రాలేదని..ఆయన మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాంటూ అనుచిత విమర్శలతో సెల్పీ వీడియో విడుదల చేశారు. వీడియోలో మహాత్మాగాంధీపై శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.